సిఎం రోడ్‌షోలో బస్సుపై నుంచి జారిపడ్డ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రోడ్‌షోలో పాల్గొన్న గుంతకల్ ఎమ్మెల్యే, అనంతపురం డిసిసి అధ్యక్షుడు మధుసూదన్ గుప్తా కింద పడిపోయారనే వార్త పట్టణంలో ఆందోళన రేపింది. పాతూరులోని తాడిపత్రి బస్టాండ్ సర్కిల్‌లో ఎంపీ అనంత వెంకటరామిరెడ్డితో కలిసి గుప్తా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రచార రథం టాప్ నుంచి ఆయన కిందపడిపోయారు.
రక్తస్రావమై ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, కార్యకర్తలు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మంత్రులు రఘువీరారెడ్డి, శైలజనాథ్ ఆయనను బెంగళూరుకు తరలించారు. మధుసూదన్ గుప్తా చేయి విరిగినట్లు సమాచారం. తలకు కూడా గాయమైంది.
కింద పడిన వెంటనే గుప్తాను అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు .ఆ తర్వాత బెంగళూర్‌కు తరలించారు. ముఖ్యమంత్రి వాహనంపై భాగాన ఎప్పుడూ ఎవరో ఒక్కరు ఉంటారు. అయినా రెయిలింగ్స్ ఏర్పాటు చేయలేదు.












Click it and Unblock the Notifications