టెక్కీ తొడపై పచ్చబొట్టు తీవ్రవాద గ్రుప్ లింక్‌కు చెందిందా?

Tattoo on techies thigh raises doubts
రాజమండ్రి: టైం బాంబు తయారు చేస్తూ ప్రమాదానికి గురైన బెంగళూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తొడపై ఉన్న పచ్చబొట్టుపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని కుడి కాలి తొడపై పచ్చబొట్టు ఉంది. అది ఏదైనా తీవ్రవాద సంస్థతో అతనికి గల సంబంధాలకు సంకేతం కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. గాయపడి ప్రస్తుతం హైదరాబాదులోని సరోజినీ దేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టెక్కీ జగదీష్ కొవ్వూరులోని దుకాణంలో ఉక్కును కొనుగోలు చేసినట్లు పోలీసులకు తెలిసింది. పేలుడు సంభవించిన జగదీష్ బావ మరిది రామకృష్ణ ఇంటిని పోలీసులు సీల్ చేశారు.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని తిలక్‌నగర్ ఏరియాలో టైం బాంబు తయారు చేస్తూ గాయపడిన టెక్కీ మిస్టరీని ఛేదించేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతని వివరాలు తెలుసుకునేందుకు ఓ పోలీసు బృందం బెంగళూర్ వెళ్లింది. సీతారామయ్య చెన్న బసవయ్య జగదీష్ అలియాస్ జగదీష్ టైం బాంబు తయారు చేస్తూ అది పేలడంతో కంటిచూపుని, రెండు చేతులను కోల్పోయిన విషయం తెలిసిందే.

జగదీష్ బెంగళూర్‌లో ఓ కంప్యూటర్ సంస్థను నడుపుతున్నట్లు సమాచారం. అనతి భార్య కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. జగదీష్ వెనక ఎవరున్నారనే విషయాన్ని ఆరా తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన జగదీశ్ హైదరాబాద్‌లోని సరోజినీ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మావోయిస్టులకు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు షెల్టర్ జోన్‌గా ఉన్న రాజమండ్రిని బెంగుళూరుకు చెందిన జగదీశ్ బాంబు తయారీ కేంద్రంగా ఎంచుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

నాటుబాంబులు, టైమర్లు , బ్యాటరీ వాచ్‌లు , పేలుడు పదార్దాలు ఒక్కరోజులో సమాకూర్చుకునేవి కాదు కాబట్టి.. ఈ కార్యకలాపాలకు ఎవరు సహకరించారనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. బాంబు పేలుడు సంభవించిన ఇల్లు జగదీశ్‌ బావ రామకృష్ణది కావడంతో పోలీసులు ఆయనను కూడా విచారిస్తున్నారు. ఉగ్రవాదులు , మావోయిస్టులుతో జగదీశ్‌కు ఏమైనా సంభందాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

ఈ కేసును అన్ని కోణాల్లో నుంచి పరిశీలన చేస్తున్నట్లు ఎస్పీ రవికుమార్ చెబుతున్నారు. వాల్ క్లాక్ లోపల టైం బాంబును అమర్చి, దాన్ని కంప్యూటర్‌కు కనెక్ట్ చేయబోతున్న సమయంలో పేలినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ క్లాక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టెక్కీ సెల్‌ఫోన్ కాల్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+