వద్దన్నందుకు: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Warangal District
వరంగల్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్య తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను నిర్ధాక్షిణ్యంగా కడతేర్చిన విషాధ సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. భర్తను చంపిన భార్యకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. వివరాలలోకి వస్తే.. వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లికి చెందిన బాబు వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయ పనులు లేనపుడు కూలీనాలి చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడి భార్య భాగ్యమ్మ కొన్నేళ్ళుగా అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరికి పన్నెండేళ్ల క్రితం పెళ్లయింది.

ఈ విషయమై బాబు ఆమెను పలుమార్లు మందలించాడు. అయినా మారకపోవడంతో బాబు తాగుడుకు బానిసయ్యాడు. బాధతో బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భాగ్యమ్మతో ఘర్షణకు దిగాడు. గొడవ అంతకంతకు పెరిగింది. దీంతో భాగ్యమ్మ తన భర్త బాబును పక్కకు తోసేయడంతో బాబు కిందపడ్డాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో అపస్మారక స్థితికి చేరుకున్న బాబును భాగ్యమ్మ ఇంట్లో దూలానికి కట్టేసి తీవ్రంగా కొట్టింది. తన చీరతో ఉరి వేసి చంపింది.

ఆ తర్వాత తనపై ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులను, గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే వారు ఆమెను అనుమానించారు. దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారమందించారు. ఓ సమయంలో పోలీసులు వారిస్తున్నా పట్టించుకోకుండా జనం ఆమెను చితకబాదారు. ఎస్సై వెంకటరావు, సిఐ అహ్మద్ భాగ్యమ్మను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భాగ్యమ్మకు ఎవరు సహకరించారనే కోణంలో విచారణ చేపడుతున్నామని సిఐ తెలిపారు.

వారికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి సోదరుడి కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భాగ్యమ్మపై హత్యా నేరం కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+