ఎమ్మెల్యే కొట్టాడని ఆరోపిస్తూ టవరెక్కిన మహిళా లీడర్

ఆ సమయంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు తాను ఒంగోలు పార్లమెంటు సభ్యులు కార్యాలయానికి వెళ్లానని, అయితే తనను ఎమ్మెల్యే ఆమంచి అడ్డుకొని కొట్టాడని ఆమె ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే ఇది జరిగిందని ఆమె ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
అయితే తాను ఫిర్యాదు చేసి మూడు రోజులు అయినప్పటికీ పోలీసులు స్పందించలేదని ఆరోపిస్తూ ఆమె సెల్ టవర్ ఎక్కి హంగామా చేశారు. తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చివరకు పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె సెల్ టవర్ పై నుండి కిందకు దిగి వచ్చారు. దాంతో అక్కడి వారు అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కాగా ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ నాయకులతో సమావేశమై ఉప ఎన్నికలలో పార్టీ గెలుపుపై దిశా నిర్దేశనం చేశారు.












Click it and Unblock the Notifications