విప్రో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

రామలక్ష్మి అనే ఆ మహిళా టెక్కి భర్తతో విడాకులు తీసుకుని తల్లి కృష్ణవేణితో పంజవంతగళ్‌లో ఉంటోంది. సంఘటనా స్థలం వద్ద సూసైడ్ నోట్ దొరికింది. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని రాసి పెట్టింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు క్షమించాలని తల్లిని కోరింది. బుధవారం నాటి నుంచి కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రామలక్ష్మి బుధవారం ఇల్లు వదిలేసి స్టార్ హోటల్లో గది తీసుకుందని భావిస్తున్నారు. తాను ఓ పదిహేను నిమిషాల్లో గదిని ఖాళీ చేస్తున్నట్లు రిసెప్షన్‌కు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పది నిమిషాల తర్వాత రూంబాయ్ వెళ్లి తలుపులు కొట్టాడు.
రూం బాయ్ తలుపులు కొట్టినా లోపలి నుంచి ప్రతిస్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిన తర్వాత గది తలుపులు తెరిచి చూసే సరికి ఆమె మరణించి ఉంది.












Click it and Unblock the Notifications