యడ్యూరప్ప: కొత్త పార్టీయా, శ్రీరాములు పార్టీలోకా?

కొందరు కర్నాటక జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ పెడతారని చెబుతుండగా, మరికొందరు మాజీ మంత్రి శ్రీరాములు స్థాపించిన బిఎస్సార్ పార్టీలో చేరతారని అంటున్నారు. ఇకపై యడ్యూరప్ప అనూనయులు శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు యడ్డీ స్థాపించిన కొత్త కార్యాలయానికే వస్తారు. బిజెపి కార్యాలయానికి వెళ్లరని యడ్డీ అనుచర మంత్రి ఒకరు చెప్పారు.
బిజెపి పాత కార్యాలయంలో సొంతంగా కొత్తగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశానని, జూన్ ఒకటి నుండి రేస్ కోర్సు రోడ్డు నివాసాన్ని ఖాళీ చేయదలిచానని, తనతో భేటీ కాదలచిన వారికి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు యడ్యూరప్ప గురువారం చెప్పారు. దీనిని ఎవరూ అపార్థం చేసుకోవద్దని, తనపై సిబిఐ విచారణ ప్రారంభమయిందని, ఈ నేపథ్యంలో బిజెపి కార్యాలయానికి తాను వెళ్లడం పార్టీ కార్యకర్తలు, నాయకులకు అసౌకర్యంగా ఉంటుందన, అందుకే ఇదంతా అని నూతన కార్యాలయంలో యడ్డీ చెప్పారు.
కాగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, భరతమాత, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ ఉపాధ్యాయ కనిపించలేదు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, నితిన్ గడ్కరీ, ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, లక్ష్మీ మిట్టల్, ముస్లిం ప్రముఖులు తదితరులు యడ్డీ ఉన్న ఫోటోల్ని ఏర్పాటు చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఉన్న ఫోటోను కూడా పెట్టినప్పటికీ విస్తృతంగా వార్తలు రావడంతో దానిని తొలగించారు.












Click it and Unblock the Notifications