ఐఎఎస్‌ల ప్రాసిక్యూషన్‌కు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్

వివిధ కేసులకు సంబంధించి ప్రస్తుత జైలులో ఉన్న బిపి ఆచార్య, శ్రీలక్ష్మిలనే కాకుండా ఇతర ఐఎఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు కూడా ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆయన శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను కూడా సిబిఐ ప్రాసిక్యూట్ చేయనుంది. దీంతో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అక్కడి నుంచి బదిలీ చేసి, వెయిటింగులో ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరో ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డిని కూడా బదిలీ చేసి వెయిటింగులో పెట్టే అవకాశాలున్నాయి.
తాజా పరిణామంతో ఐఎఎస్ అధికారుల్లో కలవరం ప్రారంభమైంది. కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో భారతి సిమెంట్స్ ప్రతినిధులు శనివారం సిబిఐ ముందు హాజరయ్యారు. మరోవైపు, తమ సంస్థల ఆస్తుల జప్తునకు సంబంధించి వైయస్ జగన్‌కు చెందిన జననీ ఇన్‌ఫ్రా, సాక్షి మీడియా శనివారం సిటీ సివిల్ కోర్టులో కెవియట్ దాఖలు చేశాయి. ఆస్తుల జప్తునకు సిబిఐ కోర్టును ఆశ్రయిస్తే ఆ సందర్భంగా తమ వాదనలు వినిపిచేందుకు జననీ ఇన్‌ఫ్రాకు, సాక్షి మీడియాకు అవకాశం ఉంటుంది.
వైయస్ జగన్‌కు చెందిన మీడియా సంస్థల ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోల ఆధారంగా సిబిఐ కోర్టు నుంచి అనుమతి పొంది ఆస్తులను జప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్ మీడియా సంస్థలు సిటీ సివిల్ కోర్టులో కెవియట్ దాఖలు చేశాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications