జగన్ గెలిస్తే అంతే: బొత్స, తులసి రెడ్డి సినిమా సెటైర్

స్వార్థంతో దుష్ట శక్తులు పన్నిన కుట్ర వల్లే ఈ ఉప ఎన్నికలు వచ్చాయని ధ్వజమెత్తారు. ఈ కుట్రను తిప్పి కొట్టేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పేరు పూర్తిగా చెప్పుకోలేని వెన్నెముక లేని నాయకుడు జగన్ అని ఎద్దేవా చేశారు. తన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఏనాడైనా చెప్పారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్థి కుంటుపడిందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదంటూ ఖండించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా తనకు తెలిసిన గజకర్ణ, గోకర్ణ విద్యల ద్వారా ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన చంద్రబాబు తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షంలో మగ్గుతున్నారని విమర్శించారు. ఆ పార్టీ పట్ల ఏ ప్రాంతంలోనూ విశ్వసనీయత లేదన్నారు.
తనను సిఎంగా చూస్తారంటూ జగన్ పగటి కలలు కంటున్నారని పిసిసి అధికార ప్రతినిధి తులసి రెడ్డి హైదరాబాదులో ఎద్దేవా చేశారు. జగన్ వాలకం చూస్తుంటే అహనా పెళ్లంట సినిమాలో ఒక నటుడు.. ఎదురుగా వేలాడదీసిన కోడిని చూస్తూ కోడికూర తింటున్నట్లు భ్రమపడే సన్నివేశం గుర్తుకు వస్తోందన్నారు.
కర్మకాలి జగన్ సిఎం అయితే రౌడీలు, దోపిడీదారులు, కబ్జాదారులకు స్వర్ణయుగం వస్తుందని ఎత్తిపొడిచారు. గతంలో సత్యం కంప్యూటర్స్, చార్మినార్ బ్యాంకు, కృషిబ్యాంకు, పోతినాయుడు, వెలుగుబంటి సూర్యనారాయణ కేసుల్లో కూడా ఇలాగే ఆస్తుల అటాచ్‌మెంట్ జరగటాన్ని గుర్తుచేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications