పరకాలకు కిరణ్: ముందస్తు అరెస్టులు, తెరాస ఆందోళన

తెరాస కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని మాజీ ఎంపి వినోద్ కుమార్ ఖండించారు. తమ పార్టీ అధినేత కెసిఆర్‌తో సమావేశం కావాల్సిన కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమన్నారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్, వరంగల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు పోన్ చేశారు. కాగా తెరాస ఆందోళన నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. దీంతో టిఆర్ఎస్ నేతలు తమ ఆందోళన విరమించారు.
ఎమ్మెల్యేలు రూరల్ ఎస్పీ రాజేష్ కుమార్‌తో అరెస్టులపై చర్చించారు. అక్రమంగా అరెస్ట్ చేశారని చెబుతూ ఆయనకు వినతి పత్రం అందించారు. కాగా ఆదివారం పరకాలలో ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెసు సీనియర్ నేత, కేంద్రమంత్రి వాయలార్ రవి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు.
కాగా పరకాల తెరాసకు జీవన్మరణ ఉప ఎన్నిక. తెలంగాణ ప్రాంతంలో తెరాసకు ధీటుగా భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళుతున్న నేపథ్యంలో పరకాలను కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే పాలమూరులో తెరాసపై బిజెపి పై చేయి సాధించింది. దీనిని తెరాస జీర్ణించుకోలేక పోతోంది. పరకాలలో కూడా పాలమూరు ఫలితం రిపీట్ అయితే పార్టీకి తీవ్ర ఇబ్బందులే అని ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు. అందుకే అక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications