పార్టీలో సత్తా గల నేత ఎక్కడ?: యడ్డీ, మోడీకి కితాబు

ఆయన తర్వాత పగ్గాలు చేపట్టిన అద్వానీ కూడా అనంత కుమార్ ప్రభావంతో ఏమీ చేయలేక పోయారన్నారు. పార్టీని తప్పుదోవలో నడపడమే కాకుండా నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి నాయకులను అణచివేసేందుకు అనంత కుమార్ యత్నిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పార్టీలో అందరికీ ఇష్టుడుగా ఎదిగినా నాయకత్వం ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
సమర్థుడైన కేంద్ర నేతలు లేకనే గుజరాత్, రాజస్థాన్, కర్ణాటకలలో పార్టీ కునారిల్లుతోందని విశ్లేషించారు. నితిన్ గడ్కరీని రెండోసారి అధ్యక్షుడుగా ప్రకటించే దిశగా ముంబైలో పార్టీ జాతీయ కార్యవర్గం 24, 25 తేదీల్లో భేటీ కానున్న నేపథ్యంలో దానికి హాజరు కాబోనని ప్రకటించారు. పార్టీని వీడబోనని, కొత్త పార్టీ పెట్టే యోచనగానీ, కాంగ్రెస్‌లో చేరాలన్న తలంపుగానీ లేదని చెప్పారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, పార్టీలో తనకు జరిగిన అన్యాయం గురించి వారికీ తెలుసునని పేర్కొన్నారు.
అన్ని విషయాలూ వారికి నేరుగా చెప్పేందుకు జూన్ 1 నుంచి రాష్ట్రంలో పర్యటిస్తానన్నారు. కాగా యడ్యూరప్పను కాంగ్రెస్‌లో చేర్చుకునేది లేదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఢిల్లీలో స్పష్టం చేశారు. మరోవైపు కర్ణాటకలో ప్రతిష్టంభనను తొలగించడానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ధర్మేంద్ర ప్రధాన్ రెండురోజులపాటు యడ్యూరప్ప, ముఖ్యమంత్రి సదానంద గౌడ, రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్పలతో సుదీర్ఘంగా చర్చించినా ఫలితం దక్కలేదు.
ఈ సందర్భంగా తక్షణం బిజెఎల్పీ భేటీ ఏర్పాటు చేసి, కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని యడ్డి డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇక ఎమ్మెల్యే రవి, తదితరులు ప్రధాన్‌ను కలిసి కొత్తవారికి అవకాశమిస్తూ మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని 70 మంది సంతకాలతో వినతిపత్రం అందచేశారు.












Click it and Unblock the Notifications