కెవిపిపై చర్యలేవి: బాబు ప్రశ్న, జగన్‌పై ధ్వజం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితి కల్పించారని ఆయన ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి తీరు వల్ల అధికారులు పనిచేయని వాతావరణం ఏర్పడిందని ఆయన అన్నారు. మంత్రులు సిబిఐ విచారణకు హాజరయ్యే దారుణమైన పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. అయినా కెవిపి రామచందర్ రావుపై చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.
రాష్ట్రం విపరీతంగా నష్టపోతోందని ఆయన అన్నారు. ప్రజలకు ఇబ్బందులు చాలా వచ్చాయని ఆయన అన్నారు. ఇంత పెద్ద అవినీతి ఎక్కడా జరిగి ఉండదని ఆయన అన్నారు. సాక్షి మీడియా విషయంలో రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు కొంత మంది లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు. అవినీతిపై తాము రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన అన్నారు. వైయస్ జగన్ అవినీతి బయటపడుతుందని ఆయన అన్నారు.
తనకు ప్రజాదరణ ఉందా, లేదా అని చూసుకోవడానికి వైయస్ జగన్ ఉప ఎన్నికలను తెచ్చి పెట్టారని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు దొంగలని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గజదొంగలని ఆయన అన్నారు. నాయకుల దురాశ వల్లనే ప్రతి నాలుగు నెలలకు ఓసారి ఎన్నికలు వస్తున్నాయని ఆయన అన్నారు. 2009 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఏడుసార్లు ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన అన్నారు. దీనివల్ల రాజకీయ నాయకుల స్వార్థప్రయోజనాలు నెరవేరుతున్నాయని, సామాన్యులు ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన అన్నారు.
మద్యం కుంభకోణాల నుంచి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను రక్షించడానికే ఎసిబిలో మార్పులు చేశారని ఆయన విమర్శించారు. విజయనగరం జిల్లా మద్యం రిటైల్ లెసెన్స్ వ్యవహారాల్లో బొత్స సత్యనారాయణ పీకల లోతు కూరుకుపోయారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications