కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది మృతి

సౌదీ అరేబియాలోని రాస్ తనురా ప్రాంతంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని సౌదీ స్టేట్ న్యూస్ ఏజెన్సీ ధ్రువీకరించింది. హెలికాప్టర్ లో ఉన్న అందరూ మృతి చెందారని.. అందరూ సౌదీ దేశస్థులేనని పేర్కొంది. ఈ విమానం సౌదీలోని ఆయిల్ రిఫైనరీ కంపెనీ అయిన ఆరామ్ కో సంస్థకు చెందినదిగా సమాచారం. అయితే హెలికాప్టర్ కుప్పకూలడానికి గల కారణాలు వెల్లడికాలేదు. ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

"ది మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ఈ విషయాన్ని తెలియజేసేందుకు తీవ్ర బాధ, విచారం వ్యక్తం చేస్తోంది. సౌదీ ఆరామ్ కో సంస్థ నడిపే హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. స్థానిక కాలమానం ప్రకారం జూన్ 28, 2026 ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లోని 14 మంది మృతి చెందారు. అంతా సౌదీ దేశస్థులే" అని అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది.

ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. ఈ దర్యాప్తులో అనేక సంస్థలు భాగస్వామ్యం అవుతన్నాయి. హెలికాప్టర్ కుప్పకూలడానికి గల కారణాలను అన్వేషిస్తున్నాయి.. అని స్టేట్ న్యూస్ ఏజెన్సీ ప్రకటనలో తెలిపింది. ఇక రాస్ తనురా ప్రాంతం హార్మూజ్ జలసంధికి ఈస్టర్ వెస్ట్ కోస్ట్ లో ఉంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దాదాపు నాలుగు నెలలపాటు సౌదీ ఆరామ్ కో సంస్థలో పనులు ఆగిపోయాయి. ఈ శుక్రవారమే రాస్ తనురా ఆయిల్ రిఫైనరీ టర్మినల్ వద్ద పనులు ప్రారంభం అయ్యాయి. ఇక సౌదీ అరేబియా.. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది.

ఇక ఫ్రాన్స్ లోని నాన్సీ ప్రాంతంలో ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిన ఘటనలో 11 మంది మృతి చెందారు. స్కై డైవర్స్ ను తరలిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు ట్రైనర్లు, ఐదుగురు విద్యార్థులు, ఒక పైలట్ ఉన్నారు.

SaudiArabia Helicopter Crash 14 Dead in Horrific Accident Ras Tanura Area Saudi Arabia helicopter

ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. విద్యార్థులు చేసే స్కై డైవింగ్ చూసేందుకు ఆ ప్రాంతానికి అప్పటికే చాలా మంది తరలివచ్చారు. అయితే అందరూ చూస్తుండగానే ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+