AP EAPCET 2026 Results Date: ఎంసెట్ ఫలితాలు ఆ రోజే-JNTUK ప్రకటన..!

ఏపీలో ఈ ఏడాది ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2026 (AP EAPCET 2026 Results) ఫలితాల విడుదలకు రంగం సిద్దమవుతోంది. ఎంసెట్ ఫలితాల విడుదలపై ఇవాళ జేఎన్టీయూకే వీసీ, ఈఏపీసెట్ కన్వీనర్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 30న ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాల్ని విడుదల చేస్తారని తెలిపారు.

అమెరికాలో క్యాంపస్ ఓపెన్ చేయబోతున్న భారతీయ ఐఐటీ..!
అమెరికాలో క్యాంపస్ ఓపెన్ చేయబోతున్న భారతీయ ఐఐటీ..!

ఈ ఏడాది మే 12 నుంచి 20వ తేదీ వరకూ ఎంసెట్ పరీక్షలు జరిగాయి. ఇందులో 3.29 లక్షల మంది అభ్యర్ధులు హాజరై పరీక్షలు రాశారు. అప్పటి నుంచీ అభ్యర్ధులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి జూన్ 1నే ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంటర్ అడ్వాన్సెడ్ , బెటర్ మెంట్ ఫలితాలు, అలాగే సీబీఎస్ఐ రీవెరిఫికేషన్ ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో వీటి ప్రభావం ఎంసెట్ ఫలితాలపై పడింది. ఎంసెట్ మార్కుల్లో వీటికి కూడా వెయిటేజ్ ఉండటంతో ప్రభుత్వం తప్పనిసరిగా ఫలితాల విడుదల ఆలస్యం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఈ నెల 30న ఫలితాలు విడుదల కానున్నాయి.

AP EAPCET 2026 Results Date JNTUK Convener Officially Announces Result Release Schedule
JoSAA 2026: జోసా కౌన్సెలింగ్ లో టాప్ బ్రాంచ్, టాపర్ల ఛాయిస్ ఐఐటీలివే..!
JoSAA 2026: జోసా కౌన్సెలింగ్ లో టాప్ బ్రాంచ్, టాపర్ల ఛాయిస్ ఐఐటీలివే..!

ఎంసెట్ ఫలితాల్ని ఈ నెల 30న విద్యాశాఖ మంత్రి లోకేష్ విడుదల ఎక్స్ లో విడుదల చేస్తారని జేఎన్టీయూకే వీసీ, ఎప్ సెట్ కన్వీనర్ కూడా అయిన సీఎస్ఆర్కే ప్రసాద్ వెల్లడించారు. అయితే టైమ్ మాత్రం చెప్పలేదు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీనిపై విద్యామంత్రి నారా లోకేష్ రేపు ఎక్స్ లో ఓ ప్రకటన చేయబోతున్నారు. ఫలితాలు విడుదల కాగానే అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in లోకి వెళ్లి వీటిని తెలుసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫలితాలను అందుబాటులో ఉంచుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+