కెసిఆర్ తగ్గాలి: పరకాలపై బిజెపి నేత జవదేకర్

Prakash Javadekar
న్యూఢిల్లీ: వరంగల్ జిల్లా పరకాల శాసనసభా నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకోవాలని, అభ్యర్థిని పెట్టకూడదని బిజెపి నేత ప్రకాష్ జవేదకర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును కోరారు. తెలంగాణ ఇస్తారని కెసిఆర్ ఇంకా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని నమ్మడం విడ్డూరమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పరకాలలో తెరాస పోటీ నుంచి తప్పుకుని తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన కెసిఆర్‌కు సూచించారు.

సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వబోరని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై నాటకాలు ఆడుతోందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య లేదంటే కాంగ్రెసు లేనట్లేనని ఆయన అన్నారు. రాజ్యసభలో ఐదు గంటల పాటు తెలంగాణపై చర్చ జరిగినా ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని ఆయన అన్నారు. తమ పార్టీయే తెలంగాణ ఇస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా తాము జాతీయ స్థాయిలో తీర్మానం చేసిందని, తమ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయె) కూడా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, అందువల్ల తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణ ఇవ్వడానికి ఏ విధమైన ఆటంకాలు ఉండవని ఆయన అన్నారు.

తెలంగాణ కోసం తాము రాజ్యసభలో పోరాటం చేస్తున్నామని, ప్రజలు తమను సమర్థించాలని ఆయన అన్నారు. తెలంగాణ కోసం బిజెపి పోరాటం చేస్తోందని ఆయన చెప్పారు. పరకాలలో తెరాస, బిజెపి మధ్య జగడం మంచిది కాదని ఆయన కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. హిందూ ముస్లిం విభజన ఉండదని ఆయన అన్నారు. జూన్ 12వ తేదీన జరిగే పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని వినిపిస్తున్న బిజెపితో పాటు తెరాస కూడా పోటీకి దిగుతోంది.

పరకాల అభ్యర్థిపై తీవ్ర మల్లగుల్లాలు పడిన బిజెపి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. పరకాల పార్టీ అభ్యర్థిగా విజయచంద్రా రెడ్డి పేరును బిజెపి సోమవారం ప్రకటించింది. మహేశ్వరపు గట్టయ్యను పరకాలలో పోటీకి దించాలని జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని లోకసత్తా నిర్ణయించింది. కాగా, తెరాస అభ్యర్థిగా బిక్షపతి పోటీ చేస్తున్నారు. కాంగ్రెసు తరఫున సమ్మారావు, వైయస్సార్ కాంగ్రెసు తరఫున కొండా సురేఖ పోటీ చేస్తున్నారు. తెలుగదేశం పార్టీ కూడా తన అభ్యర్థిని పోటీకి దించింది. దీంతో పరకాలలో బహుముఖ పోటీ అనివార్యంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+