షోలేలో గబ్బర్ సింగ్ లాంటివాడు: జగన్‌పై రేవంత్ రెడ్డి

వేల కోట్ల ప్రజాధనాన్ని దొడ్డిదారిన సొంతం చేసుకున్నజగన్ ఆ నీతిమాలిన చర్యకు వ్యాపార దక్షత అనే ముసుగు వేసుకుంటున్నాడని విమర్శించారు. ఆంధ్రా అభివృద్ధికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు తెలంగాణ ఉద్యమ పంథాను వీడి యజ్ఞ యాగాలు చేస్తున్నారని, వాటి ద్వారా తెలంగాణ వస్తుందా ఆయన అన్నారు. తెలంగాణ కోసం అనేకమంది ఆత్మబలిదానాలు చేస్తుంటే, కేసీఆర్ మాత్రం ఉప ఎన్నికల పేరుతో వారి శవాలపై సీట్లు ఏరుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఉద్యమాన్ని టీఆర్ఎస్‌కు తాకట్టు పెట్టారని, రాజ్యసభ సీటు కోసం లాలూచీ పడుతున్నారని విమర్శించారు.
కెసిఆర్ ఎడ్డి ఆదేశాలు ఇస్తే కోదండరాం వాటిని గుడ్డిగా ఫాలో అవుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణకు పట్టిన అసలైన దెయ్యం సోనియాగాంధీయేనని ఆయన విమర్శించారు. వాయలార్ రవిని ఆయన వగలమారి రవిగా అభివర్ణించారు. జగన్ గజదొంగ అయితే కొండా మురళి దంపతులు చిల్లరదొంగలని ఆయన అన్నారు. మాంత్రికుడు రాజకుమారుడిని రాక్షసదేవతకు బలి ఇచ్చినట్లు కెసిఆర్ యువకులను సోనియాకు బలి ఇస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సొంత పత్రిక ధర విషయంలోనే మాటమీద నిలబడలేని, విశ్వసనీయత లేని జగన్ రేపు ముఖ్యమంత్రి అయితే మాట మీద ఎలా నిలబడతాడా అని తెలుగుదేశం సీనియర్ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ప్రశ్నించారు. జగన్ తన పత్రిక ధరను రూ. 2.50 కు, ఆ తర్వాత రూ. 3కు పెంచాడు. ఇదేనా జగన్ విశ్వసనీయత ? పత్రిక ధర విషయంలోనే మాట మీద నిలబడలేని జగన్.. ఇక రేపు పొరపాటున ముఖ్యమంత్రి అయితే మాట మీద ఎలా నిలబడతాడని వారన్నారు
జగన్ పత్రికకు రెండేళ్లలో రూ. 86 కోట్ల ప్రకటనలిస్తే, మరో ప్రధాన పత్రికకు 2004 నుంచి 2010 మధ్య కాలంలో వచ్చిన ప్రకటనలు కేవలం రూ. 82 కోట్లు మాత్రమేనని ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. జగన్ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో లక్ష కోట్లు తిన్నాడని, కాబట్టి అసలు తన పత్రికను ఉచితంగా ఇస్తే మాత్రం నష్టమేమిటని అన్నారు. జగన్ ఇప్పుడే పత్రికాస్వేచ్ఛ గుర్తుకొచ్చిందా? ఇతర పత్రికలపై దాడులు జరిగినప్పుడు పత్రికా స్వేచ్ఛ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications