అరెస్టులపై పుకార్లు: ముందు జగనా, మంత్రులా?

CBI Logo
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసు మంత్రుల మెడకు చుట్టుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రులుగా పనిచేసి, ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ కొనసాగుతున్న కొందరిని సిబిఐ అధికారులు అరెస్టు చేయవచ్చునని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పద జీవోలపై మంత్రులను సిబిఐ అధికారులు అరెస్టు చేయవచ్చునని అంటున్నారు.

సుప్రీంకోర్టు నుంచి ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ కాగా, నలుగురి పేర్లు అరెస్టు విషయంలో బలంగా వినిపిస్తున్నాయి. మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో మంత్రుల్లో కొద్ది మంది జగన్ కన్నా ముందు అరెస్టు కావచ్చునని ప్రచారం సాగుతోంది. ఈ నెల 28వ తేదీన కోర్టుకు హాజరు కావాలని వైయస్ జగన్‌కు సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 28వ తేదీకి ముందే ఒకరిద్దరు మంత్రులు అరెస్టు కావచ్చునని అంటున్నారు.

అయితే, జగన్‌ను ఉప ఎన్నికలకు ముందు అరెస్టు చేస్తారా, తర్వాత అరెస్టు చేస్తారా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది. జగన్‌ను అరెస్టు చేస్తే ప్రజల్లో సానుభూతి పెరిగి ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లాభపడుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఆదివారం ఒక టీవీ చర్చా గోష్ఠిలో పాల్గొన్న జగన్‌ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి సైతం 28న జగన్‌ను అరెస్టు చేయకపోవచ్చునని, మహా అయితే ఉ ప ఎన్నికల తేదీకి ముందుగానో, ఆ తర్వాతో జరిగే అవకాశం ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

కాగా, ఆదివారం వరంగల్‌ జిల్లా పరకాల అ సెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని అన్నారు. వారిపై విచారణ కొనసాగుతుందన్నారు. జగన్‌పై కక్ష సాధించారన్న విమర్శలను తప్పిం చుకోవటానికి వీలుగా ముందు మంత్రుల అరెస్టును ఆమోదిస్తామనటానికి సంకేతంగానే కిరణ్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద అరెస్టుల పర్వంపై ఇటు రాజకీయ వర్గాలు, అటు అధికార వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్‌ వర్గాలు మాత్రం దీనిపై తాము వ్యాఖ్యానించేది ఏమీ లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అనేక పర్యా యాలు చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదే మార్గంలో నడిచినా ఆశ్చర్యపోనక్కరలేదని కూడా అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+