నల్లధనంపై పార్లమెంటులో ప్రణబ్ శ్వేతపత్రం

తాను సంబంధిత, సాధ్యమైన వివరాలన్ని అందించడానికి ప్రయత్నిస్తానని, ఈ సమావేశాల్లో శ్వేతపత్రం ప్రవేశపెడతామని ప్రణబ్ ముఖర్జీ గత వారం పార్లమెంటులో చెప్పారు. నల్లధనాన్ని అరికట్టేందుకు బహుముఖ వ్యూహం అవసరమని ఆయన శ్వేతపత్రాన్ని ప్రవేశపెడుతూ అన్నారు. రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారులపై దృష్టి పెడతామని ఆయన చెప్పారు. ఈ రెండు రంగాల నుంచే లెక్కకు రాని ధనం ఉందని ఆయన చెప్పారు.
కంపెనీలు పన్ను ఎగవేయడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి వోడాఫోన్ కేసే నిదర్శనమని ఆయన తన శ్వేతపత్రంలో చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. నల్లధనం వెలికితీతకు ప్రభుత్వం ఐదెంచెల వ్యూహాన్ని చేపట్టిందని, అది మంచి ఫలితాలు ఇస్తోందని ఆయన అన్నారు.
శ్వేతపత్రంలో నల్లధనానికి సంబంధించిన పూర్తి వివరాలు లేవని తెలుస్తోంది. నల్లధనంపై మూడు సంస్థలు స్వతంత్రంగా అధ్యయనం చేస్తున్నాయని, 18 నెలల కాలంలో అవి నివేదికలు సమర్పించాల్సి ఉందని, జూలై - ఆగస్టుల్లో అవి నివేదికలు సమర్పిస్తాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications