ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌దే నేరచరిత్ర: బొత్స, టిడిపి నాయకుల ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana-Revanth Reddy
ఏలూరు/విశాఖ/హైదరాబాద్/కావలి: తనను అరెస్టు చేయించడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేయిస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్‌దే నేర చరిత్ర అని ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. జగన్ నేర చరిత్ర సిబిఐ విచారణలో బయపడుతోందని ఆయన అన్నారు. కుట్రలు, కుతంత్రాలు కాంగ్రెసుకు అలవాటు లేదని ఆయన అన్నారు. జగన్‌ను అరెస్టు చేస్తే ప్రళయం వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే అన్నారని, ఇప్పుడు తమ మీద నెట్టేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.

అంతకు ముందు ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అవినీతికి బీజం వేసింది చంద్రబాబు నాయుడేనని ఆయన అన్నారు. నీతి నిజాయితీ గురించి చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందని, అవినీతి గురించి మాట్లాడడం హాస్సాస్పదంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పని అయిపోయిందని ఆయన అన్నారు.

వైయస్ జగన్ అరెస్టు చేస్తే భూకంపం ఏమీ రాదని తెలుగుదేశం నాయకుడు దాడి వీరభద్ర రావు అన్నారు. ఉప ఎన్నికలు ఆగిపోవని ఆయన మంగళవారం విశాఖపట్నంలో అన్నారు. అల్లరు చేయడానికి తెలుగుదేశం, కాంగ్రెసు కుట్ర చేస్తున్నాయని వైయస్ జగన్ అనడాన్ని ప్రస్తావిస్తూ తనను అరెస్టు చేస్తే అల్లర్లు చేయాలని జగన్ పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. కోర్టును కూడా భయపెట్టేలా జగన్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జగన్ రాజకీయ నాయకుడిలా మాట్లాడడం లేదని, నేరప్రవృత్తి గల వ్యక్తిలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కుంభకోణాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేస్తే గొడవలు ఏమీ జరగవని ఆయన అన్నారు.

కుట్రలు, కుతంత్రాలు వైయస్ ఇంటి పేరు అని తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. మతకల్లోలాలు సృష్టించిన చరిత్ర వైయస్‌దేనని ఆయన హైదరాబాదులో అన్నారు. జగన్ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలు వాయిదా వేయించాల్సిన దౌర్భాగ్యం తమ పార్టీకి లేదని ఆయన అన్నారు. వైయస్ జగనే కుట్రలూ, కుతంత్రాలూ చేస్తున్నారని ఆయన అన్నారు. టిడిపిపై అబాండాలు వేయడం దారుణమని ఆయన అన్నారు. జగన్ తప్పుడు మాటలు కట్టబెట్టి తప్పులను ఒప్పుకోవాలని ఆయన అన్నారు. జగన్‌ను అరెస్టు చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని అన్నది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులేనని ఆయన అన్నారు. గతంలో ఒక వైబ్‌సైట్‌లో వచ్చిన నిరాధారమైన వార్తను చూసి దుకాణాలపై దాడి చేసింది జగన్ వర్గీయులేనని ఆయన అన్నారు. జగన్‌కు సానుభూతి కలిగేలా కాంగ్రెసు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

వైయస్ జగన్‌కు డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళికి పట్టిన గతే పడుతుందని తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు ప్రకాశం జిల్లా కావలిలో అన్నారు. కనిమొళి సిబిఐ కోర్టు నుంచి నేరుగా తీహార్ జైలుకు వెళ్లారని, జగన్ ఈ నెల 28వ తేదీన సిబిఐ కోర్టు నుంచి చంచల్‌గుడా జైలుకు వెళ్లే అవకాశం ఉందని ఆయన అన్నారు.

English summary
PCC president Botsa Satyanarayana retaliated YSR Congress president YS Jagan. He alleged that YS Jagan has criminal record. Telugudesam leader Revanth Reddy demanded book case against YS Jagan making the unwanted statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X