భానుపై మరో కేసు, మంగలి కృష్ణతో కలిసి బెదిరింపు

భూమిని విక్రయించడానికి తనఖా పెట్టిన విషయంపై భాను కిరణ్, మంగలి కృష్ణ, వారి అనుచరులు చందు, నాయని నర్సింహారావు తనను బెదిరించారని అతను ఆరోపించాడు. తన కూతురు పెళ్లి కోసం చిరంజీవి ప్రసాద్ చందును రూ. 50 లక్షల రూపాయలు అప్పు అడిగాడని, చందు పది లక్షల రూపాయలు ఇచ్చాడని, పెళ్లి వాయిదా పడడంతో ప్రసాద్ అనుచరుడు మల్లేష్‌కు మరో 40 లక్షల రూపాయలు ఇచ్చాడని సిఐడి అధికారులు చెప్పారు.
మల్లేష్ నుంచి ప్రసాద్‌కు సకాలంలో డబ్బు అందలేదని, భూమిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి చందు ప్రసాద్ తెల్లకాగితంపై చేసిన సంతకాలను వాడుకున్నాడని, ప్రసాద్‌కు తెలియకుండానే ఆ భూమిని చందు అమ్మేశాడని అధికారులు చెప్పారు. దానిపై ప్రసాద్ చందును ప్రశ్నించగా, భాను కిరణ్, మంగలి కృష్ణ బెదిరించారని ప్రసాద్ ఫిర్యాదు చేశాడని సిఐడి అధికారులు చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ వ్యవహారాలు ఒక్కటొక్కటే బయటకు వస్తున్నాయి. అతను పట్టుబడిన తర్వాత అతను చేసిన సెటిల్మెంట్ల వ్యవహారాలపై పోలీసులు దృష్టి పెట్టారు. అతను మంగలి కృష్ణ కలిసి చేసిన భూదందాలు కూడా బయటకు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications