హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏక్షణంలోనైనా జగన్ సన్నిహితుడు మంగళికృష్ణ అరెస్ట్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mangali Krishna
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడిన మంగళి కృష్ణ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. భాను కిరణ్, మంగళి కృష్ణలు కలిసి అనేక భూదందాలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో సిఐడి కృష్ణను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.

భాను కిరణ్‌తో కలిసి మంగలి కృష్ణ అనేక సెటిల్మెంట్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. వారి భూ దందాలు, సెటిల్మెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే సిఐడి అధికారులు సేకరించారని సమాచారం. సేకరించిన ఆధారాలతో మంగలి కృష్ణ ఎప్పుడైనా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం.

మంగలి కృష్ణపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. మద్దెలచెర్వు సూరి గ్యాంగ్‌కు మంగళి కృష్ణకు ఎనిమిది ఆయుధాలు అందించినట్లుగా సిఐడి విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. సూరి జైలులో ఉన్నప్పుడే అతని ముఠా సభ్యులకు మంగలి కృష్ణ ఆయుధాలు అందజేసినట్లుగా భాను కిరణ్ అంగీకరించాడు. హంద్రీనీవా ప్రాజెక్టు గుత్తేదార్లను బెదిరించి డబ్బులను వసూలు చేసినట్లు సిఐడికి ఫిర్యాదు అందింది.

ఇందులో భానుతో పాటు మంగలి కృష్ణ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2006లో హైదరాబాద్‌లో ఏడు ఎకరాల భూమి వివాదంలో తలదూర్చి సినీ నిర్మాత శివరామకృష్ణతో పాటు మరికొందరి నుంచి రూ.1.20 కోట్లు వసూలు చేసిన డబ్బుల ద్వారా భూములు కొనుగోలు చేసినట్లు సిఐడి గుర్తించింది. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్టు చేసేందుకు కడప జిల్లాకు సిఐడి బృందం వెళ్లిందని తెలుస్తోంది.

English summary

 Mangali Krishna, who is known as best follower of YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy, may arrest any time as soon as possible. In CID enquirty revealed that, Mangali Krishna was make land settlements with Bhanu Kiran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X