అనంతలో ఘోర రైలు ప్రమాదం, 24 మంది మృతి

ఆగి ఉన్న గూడ్స్ రైలును హంపీ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. హుగ్లీ నుంచి బయలుదేరిన రైలు బెంగళూర్ చేరుకోవాల్సి ఉంటుంది. మరణించినవారిలో రైలు డ్రైవర్‌తో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గూడ్స్ రైలును జనరల్ బోగీ ఢీకొట్టడంతో ప్రయాణికుల పరిస్థితి తెలియడం లేదు.
గాయపడినవారిని బెంగళూర్, పుట్టపర్తి, అనంతపురం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మానవ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు ఆగి ఉన్న పట్టాలపైకే హంపీ ఎక్స్‌ప్రెస్ రైలుకు సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఈ ప్రమాదం సంభవించింది. రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 18 మందిని రక్షించినట్లు జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ చెప్పారు.
ప్రమాదంలో రెండు బోగీల్లో మంటలు లేచాయి. రైల్వే మంత్రి ముకుల్ రాయ్, సహాయ మంత్రి మునియప్ప సంఘటనా స్థలానికి చేరుకోవడానికి బయలుదేరుతున్నారు. అనంతపురం జిల్లాలో ఉన్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, మంత్రి రఘువీరా రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
హెల్స్ లైన్ 080 - 22372266, 22156554












Click it and Unblock the Notifications