అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

By Pratap
|
Google Oneindia TeluguNews

Train Accedent
అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన హంపీ ఎక్స్‌ప్రెసు రైలు ప్రమాదంలో మరణించినవారి వివరాలను అధికారులు వెల్లడించారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా కించెనగూడ తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. వారిని హేమాబాయి, రుద్రప్ప, పావనిబాయి, ముత్తమ్మలుగా గుర్తించారు.

అలాగే, తిరుచునగుడా తండాకు చెందిన వెంకటేష్ పవార్, బళ్లారి జిల్లా నడగుత్తికి చెందిన లక్ష్మమ్మ, మల్లేష్, వీరప్ప, కొప్పల్‌కు చెందిన సత్యనారాయణ,త పుణ్యమూర్తి మృతుల్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది మరణించినట్లు గుర్తించారు. పలువురు తీవ్ర గాయాల పాలు కావడంతో మృతుల సంఖ్య పెరిగవచ్చునని అంటున్నారు.

రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ విచారణకు ఆదేశించారు. సిగ్నలింగ్ లోపంతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని గుంతకల్ డిఆర్ఎం ఎస్ మణి చెప్పారు. ఇందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదం వల్ల ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ చెప్పారు. బోగీల నుంచి బాధితుల్ని బయటకు తీయడంతో పాటు మృతులను గుర్తించే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. ఈ ప్రమాదంలో మహిళా బోగీ తీవ్రంగా దెబ్బ తిన్నట్లు కలెక్టర్ తెలిపారు. హిందూపురంలో చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతి చెందినవారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి, తీవ్రంగా గాయపడినవారికి లక్ష రూపాయలేసి, స్వల్పంగా గాయపడినవారికి 50 వేల రూపాయలేసి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాద స్థలానికి వెళ్లాలని కర్నూలు, అనంతపురం వైద్య కళాశాలల సిబ్బందిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

రైలు ప్రమాదంలో గాయపడినవారిని పెనుకొండ, హిందూపురం ఆస్పత్రులకు తరలించారు తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నమిత్తం పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్యాస్ కట్టర్ల ద్వారా అత్యవసర ద్వారాలు తొలగించి బాధితులను బయటకు తీస్తున్నారు. జిల్లా కలెక్టర్ దుర్గాదాస్, జాయింట్ కలెక్టర్ అనితా రామచంద్రన్, డిఐజి చారు సిన్హా, ఎస్పీ ఖాన్ సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

English summary
At least 24 people were charred to death and over 50 were injured after the Bangalore-bound Hampi Express train rammed into a stationary goods train at Penukonda station, 400km south west of Hyderabad, in the Anantapur district of Andhra Pradesh early Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X