నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు లగడపాటి సవాల్, నెల తిరిగే సరికి జైలుకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajgopal - YS Jagan
నెల్లూరు: అవినీతి, అక్రమాస్తుల కేసులలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నెల రోజులు తిరిగేసరికి జైలుకు వెళ్లడం ఖాయమని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోమవారం అన్నారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే తనపై అభియోగాలు మోపారంటూ మొదట్లో జగన్ తన మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నాడని విమర్శించారు.

కానీ వాస్తవాలు ఏమిటో తాజా విచారణలో వెల్లడవుతున్నాయని అన్నారు. ముడుపులు చెల్లించిన వారే జగన్‌కు ఎంత కప్పం కట్టారో చెప్పడంతో ఆయన నిజస్వరూపం బయటపడుతోందన్నారు. ఎవరైనా ప్రేమతో చెక్కుల రూపంలో ఇచ్చిన డబ్బు చట్టబద్ధమైనదేనని, అది లంచం ఎలా అవుతుందని జగన్ ప్రశ్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇలా వ్యాఖ్యానించడం ద్వారా జగన్ అవినీతికి కొత్త భాష్యం చెబుతున్నారన్నారు. ఇలాగైతే పంచాయతీ స్థాయి నుంచి పై స్థాయి వరకు బల్లకింద చేయి పెట్టడం మాని చెక్కుల రూపంలో ప్రేమగా లంచం తీసుకోవచ్చా అని ప్రశ్నించారు. మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా రూ.800 కోట్లు, ఇతరుల ద్వారా కలిపి మొత్తం రూ.2వేల కోట్లు అక్రమంగా వైయస్ తనయుడికి చేరినట్లు ఇప్పటికే రుజువైందన్నారు.

వాస్తవాలు తెలుసుకుంటున్న ప్రజలు జగన్‌ను అరెస్టు చేయాలని కోరుకుంటున్నారన్నారు. ఇవన్నీ నిజం కాదని జగన్ అంటే దేనికైనా తాను సిద్ధమని లగడపాటి సవాల్ విసిరారు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు సాక్షి మీడియా జగన్‌కు కరపత్రంలా ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెసు, ఇతర పక్షాలపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా సాక్షి ఛానల్ పని చేస్తోందన్నారు.

English summary

 Vijayawada MP Lagadapati Rajagopal challenged YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy on Monday in his SPS Nellore district campaign. He said, Jagan would be arrested withing a month. Jagan's Sakshi is a pamphlet of YSR Congress party, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X