శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు: జగన్‌పై విహెచ్

వైయస్ జగన్ పార్టీకి ఓటువేసే ముందు విజ్ఞులైన ఓటర్లు కాస్తా ఆలోచించాలని ఆయన కోరారు. నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెసు పార్టీలో ఏ ఒక్క వ్యక్తి కూడా శాశ్వతం కాదని, హస్తం గుర్తుతోనే తామంతా గెలిచామని ఆయన అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు దండుకున్న వైయస్ జగన్ పార్టీని ఓడించాలని ఆయన ప్రజలను కోరారు.
సాక్షి మీడియా, వైయస్ జగన్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పోలవరం, నర్సాపురం శాసనసభా నియోజకవర్గాల్లో కాంగ్రెసు పార్టీదే విజయమని పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. అందరినీ కలుపుకుని సమన్వయంతో ముందుకు సాగుతామని ఆయన చెప్పారు.
ఉప ఎన్నికల ప్రచారంలో వి. హనుమంతరావు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కోస్తాంధ్రలోని జిల్లాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. వైయస్ జగన్‌పైనే కాకుండా వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. వైయస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయాలని ఆయన కాంగ్రెసు నాయకులకు సూచిస్తున్నారు కూడా.












Click it and Unblock the Notifications