జగన్‌ కేసు: ఏడు గంటల పాటు మోపిదేవి విచారణ

Mopidevi Venkataramana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో వాన్‌పిక్ వ్యవహారంపై సిబిఐ అధికారులు ప్రస్తుత ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. తమ కస్టడీలో ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డిలతో కలిపి మోపిదేవిని మూడు గంటల పాటు విచారించారు. వాన్‌పిక్ వ్యవహారంపై మోపిదేవికి సిబిఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

మోపిదేవిని రేపు గురువారం మరోసారి సిబిఐ అధికారులు విచారించే అవకాశాలున్నాయి. రేపు అవసరమైతే విచారణకు రావాలని సిబిఐ అధికారులు చెప్పినట్లు మోపిదేవి మీడియా ప్రతినిధులతో చెప్పారు. మోపిదేవిని సిబిఐ అధికారులు బుధవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రశ్నించారు. ఆయన సాయంత్రం ఆరు గంటలకు దిల్‌కుషా అతిథి గృహం నుంచి బయటకు వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

వాన్‌పిక్ వ్యవహారంలో తన పాత్ర గురించి సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు మోపిదేవి మీడియా ప్రతినిధులతో చెప్పారు. మంత్రి వర్గ నిర్ణయానికి, వాన్‌పిక్‌కు అప్పగించిన భూముల వివరాలకు మధ్య తేడా ఉందని సిబిఐ అధికారులు అన్నారని, దాని గురించి వారు తనను అడిగారని ఆయన చెప్పారు. తనకు తెలిసిన సమాచారాన్ని సిబిఐకి వివరించినట్లు ఆయన తెలిపారు. వాన్‌పిక్ భూముల వ్యవహారంపై సిబిఐ అధికారులు తనను ప్రశ్నించినట్లు ఆనయ తెలిపారు.

జోవోల జారీ విషయంలో తనపై పెద్దల ఒత్తిడి ఉందని ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఎవరు ఒత్తిడి చేశారు, ఎందుకు ఒత్తిడి చేశారనే విషయాలను సిబిఐ అధికారులు రాబట్టే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఉదయం పదకొండు గంటలకు సిబిఐ కార్యాలయానికి వచ్చే సమయంలో మీడియా ప్రతినిధులు మోపిదేవిని మాట్లాడించే ప్రయత్నం చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ.. తాను సిబిఐ ఎదుట హాజరై వచ్చాక మాట్లాడుతానని, ఇప్పుడేం మాట్లాడనని చెప్పారు. కాగా మోపిదేవి సిబిఐ ఎదుట హాజరవడం ఇది రెండోసారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+