ప్రాంతీయవాదులకే బెదరలేదు, జగన్‌కా: లగడపాటి

Lagadapati Rajgopal
గుంటూరు: తాను ప్రాంతీయవాదులకే బెదరలేదని, అలాంటిది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉడుత ఊపులకు బెదరుతానా అని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బుధవారం అన్నారు. పార్టీ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండేజ్ గుంటూరులో ప్రజాహిత యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో లగడపాటి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

జగన్ అరెస్టుకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజలు కూడా జగన్ అరెస్టును కోరుకుంటున్నారన్నారు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వాళ్లను అరెస్టు చేస్తే, డబ్బులు తీసుకున్న వారిని రథాలు ఎక్కించి ఊరేగించాలా అని ప్రశ్నించారు. జగన్‌ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలే చెప్పారని, ఇప్పుడు కాంగ్రెసు పార్టీ పైన నింద వేయాలని చూడటం శోచనీయమన్నారు.

ల్యాంకోకు తన సోదరుడు శ్రీధర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెసు పథకాలను సరైన రీతిలో ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశ్యంతోనే యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పద్దెనిమిది రోజుల్లో 18 నియోజకవర్గాలలో పర్యటిస్తామన్నారు. అభ్యర్థి గెలుపుకు సహకరిస్తామన్నారు. తానే ముఖ్యమంత్రిని అవుతానని ఓసారి, తాను అరెస్టు అవుతానని మరోసారి జగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. లక్ష రూపాయలు తీసుకున్న వాళ్లకు నాలుగేళ్ల శిక్ష పడిదే, వెయ్యి రూపాయలు తీసుకున్న వాళ్లకు ఏడాది శిక్ష పడిదే లక్ష కోట్లు దోచుకున్న జగన్‌కు ఎన్నాళ్లు శిక్ష పడాలన్నారు.

తాము పాదయాత్ర ఎప్పుడు చేసినా కాంగ్రెసు కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికే అన్నారు. జగన్ కంపెనీలలో తన సోదరుడు శ్రీధర్ పెట్టుబడులు పెడితే అతనికి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. శ్రీధర్ పెట్టుబడులు పెట్టింది ఇప్పుడు కాదని, అధికారంలోకి రాకముందు అని చెప్పారు. జగన్ తాత, తండ్రి, జగన్ తన వద్ద వ్యాపార మెళుకువలు నేర్చుకున్నారన్నారు.

జగన్ తమ పార్టీ పైన దాడి చేస్తే తప్పు లేదు కానీ, మేం మాత్రం ఎదురు దాడి చేయవద్దా అని ప్రశ్నించారు. తనను, జగన్‌ను ఎంపీలుగా చేసిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు పార్టీని విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెసు పార్టీ పైన విమర్శలు చేయడం జగన్‌కు ఏమాత్రం తగదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+