మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు: మోపిదేవి అరెస్ట్‌పై బాబు

అక్రమ భూకేటాయింపులు, ఎస్ఈజెడ్‌లు రద్దు చేయాలన్నారు. ఓ వ్యక్తి స్వార్థం కోసం చాలామంది జైలుకు వెళుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అని కాకుండా తప్పు చేసిన వారందరి పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వాటిని పేదలకు పంచి పెట్టాలన్నారు.
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి ఓ బిసి మంత్రిని బలిపశువును చేశాయని మాజీ మంత్రి టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్, కెవిపి రామచంద్ర రావు, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. దోచిపెట్టిన వారు దోచుకున్న వారు దర్జాగా బయట రోడ్ల పైన తిరుగుతున్నారన్నారు.
మోపిదేవి అరెస్టును తెలంగాణ రాష్ట్ర సమితి స్వాగతించింది. పదవులు అడ్డు పెట్టుకొని ప్రజాధనాన్ని లూటీ చేసిన వారికి జైలు శిక్ష తప్పదని తెరాస నేత శ్రవణ్ అన్నారు. పెద్ద చేపలు విచ్చలవిడిగా బయట తిరుగుతున్నాయన్నారు. దివంగత వైయస్ ఆత్మ కెవిపిని విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications