మంత్రి మోపిదేవి రాజీనామాకు అధిష్టానం ఒత్తిడి

మోపిదేవి వెంకటరమణతో రాజీనామా చేయించాలని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం పెద్దలు ఫోన్ చేసి రాజీనామా చేయాలని రాజీనామా చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి నుంచి ఆయనకు అధిష్టానం నుంచి ఆయనకు ఫోన్లు వస్తున్నాయి. అయితే, రాజీనామాకు ఆయన కాస్తా మొండికేసినట్లు తెలుస్తోంది. తనను బలి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
అధిష్టానం సూచనపై మోపిదేవి న్యాయనిపుణులతో గురువారం ఉదయం చర్చించారు. రాజీనామా చేయకపోతే బర్తరఫ్‌కు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. మోపిదేవి వెంకటరమణ బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కలిశారు. అయితే, వారు ఆయనకు ఏ విధమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ముఖ్యమంత్రి చూద్దాం అంటూ పొడిపొడిగా మాట్లాడినట్లు తెలిసిందే.
మోపిదేవి వెంకటరమణ బుధవారం వాన్‌పిక్ వ్యవహారంలో సిబిఐ విచారణకు హాజరయ్యారు. గురువారం కూడా ఆయన హాజరు కావాల్సి ఉంది. వైయస్ జగన్ అరెస్టుకు ముందు మోపిదేవి అరెస్టు అనివార్యమనే ఊహాగానాలు పెద్ద యెత్తున చెలరేగుతున్నాయి. ఆయనను గురువారం విచారణ తర్వాత సిబిఐ అరెస్టు చేయవచ్చునని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications