మంత్రులకు క్లీన్‌చిట్ వస్తుంది: అంబటి, మిగిలేది బొత్సే

Ambati Rambabu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు పార్టీలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రమే మిగులుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అన్నారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్‌కు అపూర్వ ఆధరణ లభిస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడిని చిత్రహింసలు పెట్టడంపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందన్నారు.

జగన్‌కు అన్ని వర్గాల నుండి పూర్తి మద్దతు ఉందన్నారు. పోలీసులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారన్నారు. జగన్ పైన ఎలాంటి కుట్ర జరిగినా పార్టీ కార్యకర్తలు అధైర్యపడ వద్దన్నారు. ఎలాంటి నిరుత్సాహం వద్దని, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొందామని సూచించారు. జగన్ పైన బురద జల్లేందుకు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నారన్నారు. వారికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు.

పరిస్థితి చూస్తుంటే హైదరాబాద్‌లో సైనిక పాలన ఉందన్నట్లుగా కనిపిస్తోందన్నారు. లోటస్ పాండుకు వెళ్తామన్న తమ పార్టీ నేతలను అనుమతించడం లేదని పోలీసులపై మండిపడ్డారు. సామాన్య జనాన్ని బారీకేడ్లతో అడ్డుకున్నారన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో తమ పార్టీ అన్ని స్థానాలలో సునాయాసంగా గెలుస్తుందన్నారు. ఆస్తుల కేసులో జగన్‌తో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జగన్‌ను జైలుకు పంపాలనే ఉద్దేశ్యంతోనే మాజీ మంత్రి శంకర రావుచే పిటిషన్ వేయబడిందన్నారు. మంత్రులకు 26 జివోలపై కోర్టు నోటీసులు ఇచ్చే వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు మంత్రులను రక్షించేందుకు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. మంత్రులను రక్షిస్తే తద్వారా జగన్ కూడా రక్షించబడతాడనే కుట్రతోనే కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. జగన్ క్రిమినలో, రౌడీయో కాదన్నారు. ప్రజలు మెచ్చిన నాయకుడు అన్నారు.

ఆయనను చూసి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలకు వెన్నులో చలి పుడుతోందన్నారు. జగన్‌కు వెన్నుముక లేదంటున్న బొత్స బట్టలు తడిసేలా లిక్కర్ ఎందుకు పోసుకుంటున్నారన్నారు. జగన్‌ను రౌడీగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. కాంగ్రెసు ఆదేశాల మేరకే ఉద్దేశ్య పూర్వకంగా సిబిఐ ఉప ఎన్నికల ముందు జగన్‌ను విచారిస్తోందన్నారు. ప్రజల్లో తిరగకుండా కట్టడి చేయాలని కాంగ్రెసు భావిస్తోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+