జగన్ కోసం ఏమైనా చేస్తా: మైసురా, టిడిపి సస్పెన్షన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు కోసం, జగన్ శ్రేయస్సు కోసం ఎలాంటి పనైనా చేస్తానని ఆయన అన్నారు. సిబిఐతో కుమ్మక్కయి జగన్‌పై దాడి చేయిస్తున్నారని, సిబిఐ దాడి సహేతుకుంగా కనిపించడం లేదని ఆయన అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధమైన చర్యలకు దిగుతున్నారని ఆయన అన్నారు. సిబిఐ తన పని తాను చేయకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. ఏ విధంగానైనా జగన్‌ను అరెస్టు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, అది తనకు అన్యాయమనిపించిందని ఆయన విమర్శించారు. పార్టీ కోసం శాయశక్తులా కృషి చేస్తానని జగన్‌కు చెప్పినట్లు ఆయన తెలిపారు.
తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని రాజ్యసభ సీటు అడగలేదని, ఎవరికైనా ఇచ్చుకోండని చెప్పాననని, అవసరమైనప్పుడు పిలిస్తే వస్తానని చెప్పానని ఆయన అన్నారు. వైయస్ జగన్‌కు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని, అది ఓర్వలేకనే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిళ్ల మేరకే వైయస్ జగన్‌పై ఇదంతా జరుగుతోందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాల్లో జగన్ పార్టీ గెలుస్తుందని, ప్రజల సంపూర్ణ మద్దతు జగన్‌కు ఉందని తద్వారా తెలుస్తుందని ఆయన అన్నారు.
జగన్‌పై ఆరోపణలున్నాయి గానీ అవి ఇంకా రుజువు కాలేదని ఆయన అన్నారు. జగన్‌ను అరెస్టు చేయాలని మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేశారని ఆయన అన్నారు. మోపిదేవిని బలిపశువును చేస్తున్నారని ఆయన అన్నారు. చట్టం తన పని చేస్తుంటే సంతోషించేవాడినని, ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోసం పనిచేస్తానని, అందులో చేరడం చేరకపోవడం అనేది సమస్య కాదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సలహాదారుగా ఎంవి మైసురా రెడ్డిని నియమించుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications