జగన్ పార్టీలోకి ఎమ్మెల్యేలు ఇంకా వస్తారు: సబ్బం

ఎంత మంది వైయస్సార్ కాంగ్రెసులోకి వస్తారనేది తాను కచ్చితంగా చెప్పలేనని, వలసలు మాత్రం ఉంటాయని ఆయన చెప్పారు. ఈ నెల28వ తేదీ తర్వాత పరిస్థితి అర్థమవుతుందని ఆయన అన్నారు. రేపు కూడా వైయస్ జగన్‌ను సిబిఐ విచారించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీన వైయస్ జగన్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది.
విధ్వంసానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కుట్ర చేశారనే వార్తలను ఆయన ఖండించారు. విధ్వంసాన్ని, అల్లర్లను వైయస్ జగన్ ప్రోత్సహించబోరని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కుట్రలో భాగంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు విధ్వంసానికి కుట్ర చేశారనే పథకం తయారైందని ఆయన అన్నారు.
జగన్‌ను అరెస్టు చేస్తే వంద బస్సులను తగులబెట్టడానికి ముగ్గురు వైయస్సార్ కాంగ్రెసు కార్యకర్తలు కుట్ర చేశారని, వారిని అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ ఇంచార్జీ కమిషనర్ రాజీవ్ రతన్ చెప్పారు. వారు పంపిన సెల్‌ఫోన్ మెసేజ్‌లను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో హైదరాబాదులో పోలీసుల హడావిడి పెరిగింది. హైఅలర్ట్ ప్రకటించారు. రహదారుల్లో పలు చోట్ల ముళ్ల కంచెలు వేశారు.












Click it and Unblock the Notifications