జగన్ విచారణ: రెండో రోజు ముగిసింది, మళ్లీ రేపు

హైదరాబాదులో పోలీసులు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేయడంతో వైయస్ జగన్‌ను అరెస్టు చేస్తారనే పుకార్లు బయలుదేరాయి. జగన్ అరెస్టు కాకపోవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సబ్బం హరి, జూపూడి ప్రభాకర రావు చెప్పారు. చివరకు జగన్ విచారణ ఆరు గంటల ప్రాంతంలో ముగిసింది. ఆ తర్వాత బయటకు వచ్చారు. వాన్‌పిక్ వ్యవహారంపై, తన సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహంపై సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రేపు మోపిదేవి వెంకటరమణతో కలిపి జగన్‌ను విచారించే అవకాశం ఉందని అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి ఇంట్లో ఉన్నారు. పార్టీ ముఖ్య నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. అభిమానుల సందడి వైయస్ జగన్ ఇంటి వద్ద శుక్రవారంనాటి కన్నా శనివారం ఎక్కువగా ఉంది. దాదాపు 14 గంటల పాటు సిబిఐ వైయస్ జగన్‌ను విచారించింది. ఆదివారం ఆయన మళ్లీ విచారణను ఎదుర్కొంటారు. ఎల్లుండి సోమవారం ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్య నాయకులతో ఆయన సమావేశం కానున్నారు.
తొలుత శనివారం మధ్యాహ్నం వరకు మూడున్నర గంటలపాటు జగన్‌ను సిబిఐ విచారించింది. మధ్యాహ్నం వైయస్ జగన్‌కు ఇంటి నుంచే భోజనం వచ్చింది. శుక్రవారం కూడా ఆయనకు ఇంటి నుంచి భోజనం వచ్చిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ రెండో రోజు సిబిఐ విచారణతో ఉక్కిరి బిక్కిరి అయినట్లు వార్తలు వచ్చాయి. జగన్ ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ బృందాలు బ్యాంకు ఖాతాలను పరిశీలించినట్లు తెలిసింది.
పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రభుత్వాధికారి బ్రహ్మానంద రెడ్డి, మోపిదేవి వెంకటరమణను ఇతర అధికారులు ప్రశ్నించారు. జగన్‌ను విడిగా లక్ష్మినారాయణ విచారించినట్లు తెలింసింది. తన సంస్థల్లోకి పెట్టుబడులు సక్రమంగానే వచ్చాయని, ఏ విధమైన చట్ట వ్యతిరేక వ్యవహారాలు లేవని జగన్ సిబిఐ అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఏ విధమైన క్విడ్ ఫ్రో వ్యవహారం లేదని ఆయన చెప్పారని అంటున్నారు.












Click it and Unblock the Notifications