కాంగ్రెసుపై దుమ్మెత్తిపోసిన వైయస్ వివేకానంద రెడ్డి

YS Vivekananda Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ పెద్దలపై మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై కాంగ్రెసు నాయకులు బురద చల్లడాన్ని తట్టుకోలేకనే తాను పార్టీని వీడినట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెసు నాయకులు వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్సిస్తుంటే సోనియా గాంధీ నోరు మెదపడం లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తున్నా అధిష్టానం మౌనం వహిస్తోందని ఆయన అన్నారు.

ఒకప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించిన కేంద్రం నేతలే ఇప్పుడు వైయస్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తప్పు పట్టారు. వైయస్ ఎప్పుడూ ప్రజలకు మేలు చేయాలనే కోరుకునేవారని ఆయన అన్నారు. విధానపరమైన ఆర్థిక నిర్ణయాలు మంత్రి వర్గం అనుమతితోనే జరుగుతాయని, వాటి పట్ల వైయస్‌కు మాత్రమే కాకుండా మంత్రులకూ బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు.

కొత్త పన్నులు వేయకుండా ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని ఆయన అన్నారు. రాజకీయాలు చేయడంలో మునిగి తేలుతున్న కాంగ్రెసు నాయకులు వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడాన్ని మరిచిపోయారని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆనయ అన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అయోమయంగా, గందరగోళంగా ఉన్నాయని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మినీ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గట్టు రామచందర్ రావు అన్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆయన అన్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి ప్రభుత్వానికి కాలం చెల్లిందని ఆయన వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+