జగన్‌కు మంచి భవిష్యత్తు: శంకరరావు, బిజెపి మద్దతు

P Shankar Rao
హైదరాబాద్/న్యూఢిల్లీ: కేసుల నుండి బయటపడిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి శంకర రావు సోమవారం అన్నారు. జగన్ అరెస్టు కాంగ్రెసు పార్టీ కుట్ర అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ అనటం సరికాదన్నారు. తల్లిగా ఆమె పడే బాధతో తాను ఏకీభవిస్తున్నానని, అయితే కాంగ్రెసును నిందించడం మాత్రం సరికాదన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై మాట్లాడే నైతిక హక్కు మంత్రులకు లేదన్నారు. ఎవరి పైనో అభియోగాలు చేసి తప్పించుకోజూడటం సరికాదన్నారు. జగన్ ఆస్తుల కేసులో చట్టం తన పని తాను చేసుకు పోతోందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు స్వచ్చంధంగా తప్పుకోవాలని ఆయన సూచించారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని అరెస్టు చేసినప్పుడే జగన్‌ను కూడా చేస్తే బాగుండేదన్నారు. ఉప ఎన్నికలపై జగన్ అరెస్టు ప్రభావం పడుతుందన్నారు.

మరోవైపు వైయస్ జగన్‌కు భారతీయ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది! జగన్‌కు వస్తున్న ప్రజాధరణ చూసి కాంగ్రెసు భయపడుతోందని బిజెపి నేతలు న్యూఢిల్లీలో అన్నారు. సిబిఐని ఉపయోగించి కాంగ్రెసు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. సిబిఐ విచారణలో తాము జోక్యం చేసుకోమని కాంగ్రెసు పార్టీ చెప్పడం విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉందన్నారు.

జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదా అని ప్రశ్నించారు. జగన్ వల్ల కూడా ఎవరూ నష్టపోలేదన్నారు. ఫిర్యాదు లేకున్నా అరెస్టు చేశారని, సిబిఐ వ్యవహారం చూస్తుంటే అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను అరెస్టు చేయడంపై ఎన్నికల సంఘం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. ఉప ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసేందుకు సిబిఐని వాడుకోవడం కాంగ్రెసు మానుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+