జగన్‌పై పలు కేసులు: రుజువైతే ఏ సెక్షన్ క్రింద ఏ శిక్ష

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 120-బి రెడ్ విత్, 420, 409, 420, 468, 471, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) కింద కేసు నమోదు చేసింది. ఆయా సెక్షన్ల క్రింద నేరం రుజువైతే నేరస్తుడికి ఈ క్రింది విధంగా శిక్ష పడే అవకాశం ఉంది.

సెక్షన్ 420 - దగా, మోసం క్రింద నేరం రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
సెక్షన్ 409 - కుట్రపూరితమైన నమ్మక ద్రోహం క్రింద నేరం రుజువైతే యావజ్జీవం లేదంటే పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
సెక్షన్ 477 - ఖాతాలను తారుమారు చేయడం క్రింద నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష జరిమానా విధించవచ్చు.

సెక్షన్ 468 - ఫోర్జరీ పత్రాలను ఒరిజినల్ పత్రాలుగా చూపి మోసగించడం క్రింద నేరం రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది.
సెక్షన్ 471 - ఎవరినైనా మోసం చేయడానికి ఫోర్జరీ పత్రాలను, రికార్డులను ఉపయోగించడం క్రింద నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది.
సెక్షన్ 120బి - కుట్ర క్రింద నేరం రుజువైతే ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది.

అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు
సెక్షన్ 13(2) - ప్రభుత్వ హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే కనీసం ఏడాది నుండి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. జరిమానా కూడా విధించవచ్చు.
సెక్షన్ 13(1)(డి) - అవినీతికి పాల్పడటం వల్ల స్వయంగా కానీ, మరో వ్యక్తి ద్వారా కానీ భారీగా లబ్ధి పొందడం, బహుమతులు స్వీకరించినట్లు తేలితే కనీసం ఏడాది నుండి ఏడేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా విధించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+