జగన్‌పై రేణుకా చౌదరి ఫైర్: విజయమ్మకు సలహా

వైయస్ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానమే కదా అంటే, మీకు మీ సంపాదకులు ఓ బాధ్యత అప్పగించారు, మీరేం చేస్తున్నారో చూస్తున్నారా, నమ్మకం మీద బాధ్యత అప్పగించారు అని ఆమె అన్నారు. నీతిమంతుడిగా రుజువు చేసుకోవడానికి వైయస్ జగన్‌కు ఇది మంచి అవకాశమని ఆమె వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి చేసిన తప్పునకు ఎంతో మంది నేరస్థులయ్యారని ఆమె అన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైపోదని ఆమె అన్నారు.
తప్పు చేసిన కుమారుడిని వెనుకేసుకుని రావద్దని ఆమె వైయస్ విజయమ్మకు సూచించారు. తల్లిగా విజయమ్మ తన బాధ్యత నిర్వహించాలని ఆమె అన్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వైయస్ జగన్‌కు చట్టం అమలు కావాలా, వద్దా అని ఆమె అడిగారు. వైయస్ రాజశేఖరెడ్డిని 30 ఏళ్లు కాపాడి, ఎదిగేందుకు సహకరించిందని, అన్ని విధాలుగా అర్థం చేసుకుని ముఖ్యమంత్రిగా పనిచేస్తారని కాంగ్రెసు అధిష్టానం భావించిందని ఆమె అన్నారు. నిజం ఏ రోజుకైనా బయటపడుతుందని ఆమె అన్నారు.
వైయస్ విజయమ్మ బాధలో తాత్కాలికంగా అలా మాట్లాడి ఉండవచ్చునని అనుకున్నామని, అలా అనుకోవడం తమ బలహీనత కాదని ఆమె అన్నారు. వైయస్ జగన్ అరెస్టు రాజకీయ కుట్ర కాదని, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే జగన్‌పై సిబిఐ చర్యలు తీసుకుందని ఆమె అన్నారు. సిబిఐ దర్యాప్తు చేస్తుంటే తమపై దుమ్మెత్తిపోస్తే ఎలా అని ఆమె అడిగారు. మోపిదేవి వెంకటరమణ నిర్దోషి అని ముఖ్యమంత్రి ఎలా అంటారని అడిగితే తన మంత్రివర్గంలో పనిచేసిన మోపిదేవిపై నమ్మకంతో అలా అని ఉంటారని ఆమె జవాబిచ్చారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications