జగన్ పార్టీలో చేరుతున్నా: వైయస్ వివేకానంద రెడ్డి

పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన దివంగత వైయస్ పైన కొందరు కుట్రతో అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, వాటిని తాను సహించలేక పోతున్నానన్నారు. అందుకే కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసులో చేరుతున్నట్లు చెప్పారు. ఆయన కడప జిల్లా పులివెందులలో తన కార్యకర్తలతో మంతనాలు జరిపారు. ఇడుపులపాయలో దివంగత వైయస్ఆర్ సమాధి వద్ద తాను వైయస్సార్ కాంగ్రెసులో చేరుతున్నట్లు చెప్పారు.
గుర్తింపు లేని పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదని, జగన్‌కు అండగా నిలబడాలనుకుంటున్నట్లు చెప్పారు. కాగా వైయస్ వివేకానంద రెడ్డి ఇటీవల కాంగ్రెసు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన సోదరుడు వైయస్ రాజశేఖర రెడ్డి పైన కాంగ్రెసు నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని, అందుకే తాను కాంగ్రెసును వీడుతున్నట్లు ప్రకటించారు.
మరోవైపు విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యుడు సుజయ కృష్ణ రంగారావు బుధవారం కాంగ్రెసు పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. ఆయనకు పిసిసి క్రమశిక్షణా కమిటీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications