ఎవరు గెలిచినా ఓడేది ప్రజలే: తెలంగాణలో జెపి ప్రచారం

అవినీతి పార్టీలకు ఓటు వేస్తే ఎవరు గెలిచినా ఓడేది మాత్రం జనమే అన్నారు. వందల కోట్లతో వ్యాపారం వేలకోట్లు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు, అధికారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనే వ్యవస్థ కోసం పోరాటం చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు అవినీతిమయంలో కూరుకుపోయాయన్నారు. వ్యవస్థ మార్పు కోసం కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోరాటం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.
ఎన్నికల విధానంలో దామాషా పద్ధతి కోసం జాతీయ స్థాయిలో కలిసొచ్చే పార్టీలతో పోరాటం చేస్తామన్నారు. బలహీనమైన చట్టాల వల్ల అవినీతిపరులు తమ పని తాము కానిస్తున్నామన్నారు. అవినీతి నిరోధక శాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ త్వరలో హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డొల్ల పుచ్చకాయ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వేరుగా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిల స్వభావం వైయస్ విజయమ్మకే తెలుసునన్నారు. వైయస్ అవినీతికి కేంద్రం సహకారం చేసిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications