నా కడుపు మంట ... : విజయమ్మ తొలి ఎన్నికల స్పీచ్

పాదయాత్ర అనుభవాలను, అంతకు ముందటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడని, పార్టీలకూ మతాలకూ కులాలకూ అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలని వైయస్ ఆశించారని, ఆ పథకాలు ఎలా అమలవుతున్నాయో చూడడానికే రచ్చబండ కార్యక్రమానికి ఆ రోజు బయలుదేరారని అన్నారు. పథకాలపై ప్రజలకు నమ్మకం పోయిందని, రైతులకూ రైతు కూలీలకూ భరోసా లేకుండా పోయిందని, పిల్లల చదువులు దెబ్బ తింటున్నాయని ఆమె విమర్శించారు.
రైతుల కోసమే అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ప్రతి అన్యాయానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఇి రాష్ట్ర రాజకీయాలను మార్చే ఎన్నికలని, ప్రజల మన్నికలేని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆమె అన్నారు. రాజన్న మీద, జగన్ మీద, ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలని ఆమె కోరారు.
ప్రసంగాన్ని ముగించిన తర్వాత మన గుర్తేమిటంటూ ప్రజలను అడిగారు. ఫ్యాన్ అనే సమాధానం రావడంతో చల్లటి గుర్తు అని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు, వైయస్ జగన్ ప్రకటించిన పథకాలు అమలు కావాలంటే తమ పార్టీకి ఓటేయాలని ఆమె ప్రజలను కోరారు. వైయస్ జగన్ జైలు పాలు కావడంతో ఆమె బుధవారంనాడు నర్సన్నపేట నుంచి తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
జగనన్నను అన్యాయంగా అరెస్టు చేశారని వైయస్ జగన్ సోదరి షర్మిల అన్నారు. తమ కన్నీటిని చూసి నవ్వుతున్నవారికి గుణపాఠం చెప్పాలని ఆమె ప్రజలను కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్ట్ీకి ఓటేసి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆమె సూచించారు. మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకోవాలని, జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications