యుపిఎ నుంచి తప్పుకుంటాం: కరుణానిధి

Karunanidhi
చెన్నై: పెట్రోల్ ధర పెంపుపై యుపిఎ ప్రభుత్వం మీద తమిళనాడుకు చెందిన డిఎంకె భగ్గుమంది. దారుణమైన పెట్రోల్ ధర పెంపునకు నిరసనగా తాము యుపిఎ నుంచి తప్పుకుంటామని డిఎంకె బుధవారం హెచ్చరించింది. ప్రజల మనోభావాలను గౌరవించే విషయంలో తమ పార్టీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని డిఎంకె చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అన్నారు. తమ పార్టీ సంకీర్ణంలో ఉందని, అయితే కూటమిలో ఉండడం వేరు, ప్రజలపై భారం వేసే విధానాలను వ్యతిరేకించడం వేరు అని ఆయన అన్నారు.

పెట్రోల్ ధర పెంపునకు నిరసనగా జరిగిన పార్టీ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం బస్సు చార్జీలను, పాల ధరలను పెంచడాన్ని కూడా డిఎంకె నిరసించింది. ప్రజలపై భారం వేసినప్పుడు గతంలో కూడా తాము కూటముల నుంచి తప్పుకున్నామని కరుణానిధి చెప్పారు. గతంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయె నుంచి, విపి సింగ్ మంత్రివర్గం నుంచి తప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించినప్పుడు తాము నిరసన గళం వినిపిస్తామని, కూటమిలో భాగస్వామ్య పక్షంగా వాటిని పరిష్కరించలేనప్పుడు బయటకు రావడానికి వెనకాడబోమని ఆయన అన్నారు. పెట్రోల్ ధర పెంపును ఆయన దారుణమైన చర్యగా అభివర్ణించారు. ప్రతిపక్షాలు, యుపిఎ భాగస్వామ్య పక్షాలు మాత్రమే కాకుడా రక్షణ మంత్రి, కాంగ్రెసు నేత ఆంటోనీ కూడా పెట్రోల్ ధర పెంపును వ్యతిరేకించారని ఆయన అన్నారు.

పెట్రోల్ ధర పెంపునకు నిరసనగా అన్నాడియంకె తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది. పెంచిన పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వ్యాట్‌ను తగ్గించి, పెట్రోల్ ధర తగ్గేలా చర్యలు తీసుకునే విషయంపై మాట్లాడడానికి ప్రభుత్వాధికారులు నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+