బాబుకు షాక్: చిన్నం సంచలన వ్యాఖ్య, జగన్ వైపుకు

Chandrababu Naidu - Chinnam Ramakotaiah
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి! కృష్ణా జిల్లా నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్య గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తనకు టిక్కెట్ ఇచ్చినా తాను పోటీ చేయనని ఆయన అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు.

తన భవిష్యత్తుపై కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పార్టీ మారాలనుకుంటే కార్యకర్తలతో చర్చించిన అనంతరమే నిర్ణయిస్తానని చెప్పారు. కాగా చిన్నం రామకోటయ్య తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్ధమై పోయినట్లుగానే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చిన్నం రామకోటయ్యతో మంతనాలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి.

ఆయన త్వరలో టిడిపికి గుడ్‌బై చెప్పి త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లా జగన్ పార్టీ సామినేని ఉదయభానుతో పాటు రాష్ట్ర స్థాయి నేతలతో చిన్నం రామకోటయ్య చర్చలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసే పరిస్థితులు లేవని, జిల్లా నేతలు తనను ఏ కార్యక్రమానికి పిలవడం లేదని, చంద్రబాబు కూడా వారి మాటలనే పరిగణలోకి తీసుకుంటున్నారని ఆయన ఆవేదనతో ఉన్నారట. అందుకే ఆయన పార్టీని వీడాలనుకుంటున్నారని అంటున్నారు.

కాగా ఈ అంశంపై చిన్నం రామకోటయ్య ఓ టివి ఛానల్‌తో స్పందించారు. తాను భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేయనని మాత్రమే చెబుతున్నానని, తన నియోజకవర్గం ప్రజలకు ఏ పార్టీ ద్వారా సేవ చేయగలుగుతానని భావిస్తే తాను అదే పార్టీలో చేరతానని చెప్పారు. తనతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మాట్లాడరన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. తనతో ఏ పార్టీ నేతలు మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ, సిపిఐ ఐదు పార్టీలు ఉన్నాయని, ఏ పార్టీ ద్వారా సేవ చేయగలుగుతానని భావిస్తే అందులో చేరతానని స్పష్టం చేశారు.

కాగా చిన్నంకు చంద్రబాబు ఫోన్ చేసి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా చిన్నం తన అసంతృప్తిపై వివరణ ఇచ్చారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+