నేనూ ఏడుస్తా: విజయమ్మపై సినీ యాక్టర్ కవిత సెటైర్

ఆమె గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైయస్ జగన్ కుటుంబానికి నటనలో ఆస్కార్ అవార్డు వస్తుందని ఎద్దేవా చేశారు. కంటతడి పెడితే సానుభూతితో ఓట్లు రాలుతాయనుకుంటే పొరపాటు అన్నారు. వైయస్ జగన్ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక నేరస్థుడని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు అభివర్ణించారు.
అంతులేని అవినీతిపరులైన ఒకప్పటి ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అధ్యక్షులు సుహార్తో, మార్కోస్‌ల స్థానాలను ఇప్పుడు మన దేశంలో కేంద్ర మాజీ మంత్రి రాజా, జగన్ దక్కించుకున్నారని ఆయన విశాఖలో ఎద్దేవా చేశారు. కొడుకును జైల్లో పెడితే తల్లి విజయలక్ష్మి ధర్నాకు దిగడం, ఎన్నికల ప్రచారం నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు.
జగన్ జైలుకెళితే విజయలక్ష్మికి పొంగుకొచ్చిన వాత్సల్యం అధికారులు, మంత్రి అరెస్టయినప్పుడు కనిపించలేదేమని మరో నేత ఎర్రన్నాయుడు విమర్శించారు. కొడుకు జైలుపాలైతే హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా ఎన్నికల ప్రచారానికి రావడాన్ని ఆయన ఆక్షేపించారు. అధికార కాంక్ష తప్ప జగన్‌కు, ఆయన తల్లికి మరో ఆలోచన లేదన్నారు.












Click it and Unblock the Notifications