గాలికి బెయిల్, న్యాయమూర్తి అరెస్టుకు సిబిఐ రెడీ?

Pattabhi Ramarao
హైదరాబాద్: లంచం తీసుకుని ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి పట్టాభి రామరావు అరెస్టుకు సిబిఐ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. పట్టాభి రామారావు అరెస్టుకు తమకు అనుమతి ఇవ్వాలని సిబిఐ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరినట్లు తెలుస్తోంది. అనుమతి రాగానే ఆయనను సిబిఐ అరెస్టు చేస్తుందని అంటున్నారు. లంచం తీసుకుని బెయిల్ ఇచ్చిన వ్యవహారంలో పట్టాభి రామారావుపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది.

కాగా, పట్టాభి రామారావు ఆచూకీపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆయన మే 26వ తేదీ నుంచి కనిపించడం లేదనే వాదన ఓ వైపు వినిపిస్తుండగా, ఆయన సిబిఐ అదుపులోనే ఉన్నారనే వాదన మరో వైపు వినిపిస్తోంది. అయితే, ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పట్టాభి రామారావుకు గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినందుకు పది కోట్ల రూపాయలు లంచం ముట్టినట్లు సిబిఐ అధికారులు గుర్తించారని అంటున్నారు. లంచం వ్యవహారం తన దృష్టికి రాగానే సిబిఐ మే 26వ తేదీన ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

గాలి జనార్దన్ రెడ్డికి, పట్టాభి రామారావుకు మధ్య రిటైర్డ్ న్యాయమూర్తి చలపతి రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఆయనకు రెండు లాకర్లు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తర్వాత సిబిఐ అధికారులు హైదరాబాదులోని బ్యాంకులపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావడంలో ఐదుగురు కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. వారిలో పట్టాభి రామారావు కుమారుడు, రిటైర్డ్ న్యాయమూర్తి చలపతిరావు, ఓ రాజకీయ నాయకుడు, ఓ రౌడీ షీటర్ ఉన్నట్లు చెబుతున్నారు.

సిబిఐ అధికారులు ఐదు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బెయిల్ మంజూరు చేసినందుకు పట్టాభి రామారావుకు ముందు మూడు కోట్ల రూపాయలు అందినట్లు, ఆ తర్వాత మరో ఏడు కోట్ల రూపాయలు అందినట్లు చెబుతున్నారు. మిగతా ఏడు కోట్ల రూపాయల ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. బళ్లారి నుంచి రెండు దఫాలుగా ఆ సొమ్ము చేరినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని అశోక్ నగర్‌లోని ఓ బ్యాంకులో మూడు కోట్ల రూపాయలు డిపాజిట్ అయినట్లు తెలుస్తోంది. పట్టాభి రామారావు కుటుంబ సభ్యుల నుంచి సిబిఐ అధికారులు బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+