ఎమ్మెల్యేలు అంగడి సరుకు: జగన్‌పై నామా ఫైర్

MP Nama Nageswara Rao
హైదరాబాద్: శాసనసభ్యులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అంగడి సరుకుగా మార్చారని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపుదారులను ప్రజల్లో తిరగనివ్వరాదని ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి న్యాయమూర్తికి లంచం ఇచ్చారనే ఆరోపణపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. అవినీతి సొమ్ముతో అన్ని వ్యవస్థలను మాఫియా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్సించారు.

కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కుంభకోణాలు పెరిగాయని, అవి కూడా న్యాయవ్యవస్థ చొరవ కారణంగానే బయటకు వస్తున్నాయని, అటువంటి న్యాయవ్యవస్థను కూడా దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థ కారణంగానే గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కుంభకోణం, వైయస్ జగన్ కుంభకోణాలు బయటకు వచ్చాయని ఆయన అన్నారు. అవినీతి సొమ్ముతో రాజకీయాల్లో బేరాలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. శానససభ్యులకు వైయస్ జగన్ రెండు కోట్ల నుంచి పది కోట్ల రూపాయల వరకు ఇవ్వజూపుతున్నారని ఆయన అన్నారు.

గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ అవినీతి వ్యాపారాలు చేశారని తెలుగుదేశం పార్టీ మరో పార్లమెంటు సభ్యుడు దేవేందర్ గౌడ్ అన్నారు. మైనింగ్ మాఫియా ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా పరిణమించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థను కూడా డబ్బు ఎర చూపి భ్రష్టు పట్టించే ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆయన అన్నారు.

గాలి జనార్దన్ రెడ్డి న్యాయమూర్తి పట్టాభిరామారావుకు లంచం ఇచ్చిన వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆయన అన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. మైనింగ్ అక్రమాలు విపరీతంగా జరిగాయని, చాలా మందిని డబ్బుల ద్వారా లొంగదీసుకునే ప్రయత్నాలు చేశారని, లొంగనివారిని వివిధ రీతుల్లో వేధించే పనికి ఒడిగట్టారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+