జైలులో జగన్‌కు గట్టి భద్రత, ఖాతాలో డబ్బులు నిల్

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై ఆయన భార్య భారతి కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో జైలులో జగన్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు జగన్‌కు కల్పిస్తున్న భద్రతపై జైలు అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. జగన్ ఉన్న బ్యారక్ సమీపంలోని జైలు గోడ వెలుపల కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు.

జైలు చుట్టుపక్కల ఉండే టవర్‌లపై కూడా సాయుధ సిబ్బందితో నిరంతర భద్రత కల్పిస్తున్నారు. జగన్ బ్యారక్ వద్దకు ఇతర ఖైదీలతో పాటు, జైలు సిబ్బందిని సైతం ఆనుమతించడం లేదు. కాగా, గురువారం ఉదయం సాక్షి గ్రూప్ ప్రతినిధులు, విజయసాయిరెడ్డి, వైయస్ భారతి, వైవి సుబ్బా రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని జగన్‌ను కలిశారు.

కష్టాలలో ఉన్న వైయస్ కుటుంబానికి తాను అండగా నిలుస్తానని ఆళ్ల నాని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. జైలుకు వచ్చినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపని జగన్ క్రమంగా తోటి ఖైదీలతో ముచ్చటిస్తున్నట్లు సమాచారం. గురువారం ఉదయం 7గంటలకు నిద్ర లేచి కొద్దిసేపు యోగా చేసి, విఐపి ఖైదీలతో షెటిల్ ఆడినట్టు తెలుస్తోంది.

నీట్‌గా షేవింగ్ చేసుకున్నట్టు తెలిసింది. ఉదయం అల్పాహరంగా ఉప్మా తీసుకుని, మధ్యాహ్న భోజనంలో టమోటా, పాలకూర పప్పు, రసం, పెరుగన్నం తీసుకున్నారు. రాత్రి వెజిటబుల్ కర్రీతో పుల్కాలు తిన్నారు. కోట్లాది అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌కు జైలు ఖాతాలో రూపాయి కూడా డిపాజిట్ లేకపోవడం గమనార్హం. ఈ ఖాతాలోని డబ్బుతోనే జైలు క్యాంటీన్‌లో లభించే వస్తువులను ఖైదీలు కొనుగోలు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+