రైల్వే కోడూరు: తాజా మాజీ శ్రీనివాసులుకు అదే ధీమా

K Srinivasulu
కడప: కడప జిల్లా రైల్వే కోడూరు శాసనసభా నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించినా పెత్తనమంతా అగ్రవర్ణాల నాయకులదే. ఈ స్థానాన్ని మూడు ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. తెలుగుదేశం అభ్యర్థి ఎన్.అజయ్‌బాబు, కాంగ్రెస్ అభ్యర్థి కె.ఈశ్వరయ్య, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు మధ్యే పోటీ ఉంది. తెలుగుదేశం నియోజకవర్గం ఇన్‌ఛార్జి కస్తూరి విశ్వనాథనాయుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రారాయుడు, డీసీసీ ఛైర్మన్ కె.బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నిన్నామొన్నటి వరకూ ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది.

కట్టా నారాయణనాయుడు మరణానంతరం తెలుగుదేశం పార్టీకి సమస్య తలెత్తింది. నియోజకవర్గంలో మొదట్నుంచి బలిజ, కమ్మ వర్గాలకు చెందిన నేతలే ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. ఇటీవలి దాకా కట్టా నారాయణనాయుడు తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన కస్తూరి విశ్వనాథనాయుడు పార్టీ అభ్యర్థి బాధ్యతలను తనపై వేసుకున్నారు. బడుగు, బలహీనవర్గాలు, కమ్మవర్గాల ఓట్లు ఆ అభ్యర్థికే పడతాయని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాదిగి ఉపకులానికి చెందినవాడు కావడం, మిగతా ఇద్దరు అభ్యర్థులు మాల ఉపకులానికి చెందినవారు కావడం ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బాధ్యతలు డీసీసీ ఛైర్మన్ కె. బ్రహ్మానందరెడ్డి తీసుకున్నప్పటికీ వైయస్ కుటుంబసభ్యుడు వైయస్ కొండారెడ్డి సైతం ఎన్నికల బాధ్యతలు తీసుకున్నారు. వైయస్ అనుచర గణం కె. శ్రీనివాసులుకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెసు విషయంలో నియోజకవర్గం ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు హవా కొనసాగుతోంది. ఆయన తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటుచేసుకున్నందున వారంతా కాంగ్రెస్ అభ్యర్థి వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది.

కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తొలి విడత ప్రచారం చేశారు. మాజీ ఎంపి జి.రామయ్య, ఆయన సోదరుడు మాజీ సర్పంచ్ కేశవులు, రాష్ట్ర మంత్రి సి.రామచంద్రయ్య, పార్లమెంటు సభ్యులు ఎ.సాయిప్రతాప్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరపున పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రచారం చేశారు. రాష్ట్ర నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సైతం ప్రచారం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ఇప్పటికే జగన్మోహన్‌రెడ్డి గతంలో ఓసారి ప్రచారం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+