అనంతపురం అర్బన్: గుర్నాథ్ రెడ్డి నిలబెట్టుకుంటారా?

మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో ముఖాముఖి పోటీ జరుగుతూ వచ్చింది. ముఖాముఖి పోటీలో ఎక్కువ సార్లు కాంగ్రెసు విజయం సాధించింది. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రవేశంతో ముక్కోణపు పోటీ నెలకొంది. దీంతో కాంగ్రెసు ఓట్లు చీలి తమకు లాభం చేకూరుతుందని తెలుగుదేశం పార్టీ అశపడుతోంది. 1952 నుంచి ఇప్పటి వర కు 14సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అనంతపురం నియోజకవర్గం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థులు 9సార్లు గెలుపొందగా, సీపీఐ రెండు సార్లు, సీపీఎం ఒక్కసారి మా త్రమే గెలుపొందాయి.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత మొదటిసారి 1983 లో జరిగిన ఎన్నికల్లో సుమారు 40 వేల ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి గెలుపొందారు. రెండేళ్ల అనంతరం 1985లో జరిగిన ఎన్నికల్లోనూ అదే పార్టీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ మె జార్టీ 6వేలకే పరిమితమైంది. ఆ తరువాత 1989 నుంచి 2009 వరకు ప్ర తి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిగాయి. 1989, 1999, 2004, 2009లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1994లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుని మిత్రపక్షమైన సిపిఐని రంగంలో కి దింపింది. 1999 నుంచి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వరుసగా ఓడిపోతూ వస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తన వేగం తగ్గలేదని నిరూపించుకునే పనిలో పడింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెంట కొందరు నేతలు వెళ్లిపోవడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన విషయమే. ఆ లోటు భర్తీకి తెరవెనుక పాచికలు కదుపుతోం ది. అంతర్గత కుమ్ములాటలకు ఇది సమయం కాదనే సంకేతాలు ముఖ్యనేతలకు ఇస్తోంది. ఎడ మొహం, పెడమొహంగా ఉన్న ముఖ్య నేతలను సైతం కలుపుకుపోయే వ్యూహానికి పదునుపెడుతోంది.
కాంగ్రెస్ తరఫున అనంతపురం అర్బన్‌లో మంత్రి శైలజానాథ్, పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డిలతోపాటు ఆ పార్టీ ముఖ్యనేతలు ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డిని రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కోసం ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట వెంకటప్రసాద్, పల్లెరఘునాథరెడ్డి, అబ్దుల్ ఘని, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్‌చౌదరి పని చేస్తున్నారు.












Click it and Unblock the Notifications