సూరి పేరు వాడుకుని బెదిరించా: మంగలి కృష్ణ

తాను యువనేత పేరును, భానుకిరణ్ మద్దెలచెరువు సూరి పేరును వాడుకొని పలువురిని బెదిరించానని అంగీకరించినట్లు సమాచారం. కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సిఐడి విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. తమ ముఠా సుమారు రూ.80కోట్లు జలయజ్ఞం కాంట్రాక్టర్ల నుంచే వసూలు చేసినట్లు అంగీకరించాడని సమాచారం. సుమారు 25మంది కాంట్రాక్టర్లు భాను గ్యాంగ్‌కు కోట్లరూపాయలు చెల్లించినట్లు సిఐడి అధికారుల వద్ద సమాచారముంది. దీనికి ఆయుధాల సమాచారం మినహా అంతా దాదాపు సరిపోయినట్లు తెలిసింది.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూరీడు అబిడ్స్‌లో రెండు రివాల్వర్లు తనకు కొనిచ్చినట్లు భాను నేరాంగీకార పత్రంలో వెల్లడించినట్లు సిఐడి తెలిపింది. దీన్ని నిజమేనని కృష్ణ చెప్పినట్లు సమాచారం. అయితే ఆయుధాలు కృష్ణ ఇచ్చాడని భానుకిరణ్ మరోసారి సిఐడి అధికారులకు చెప్పడంతో కృష్ణ కావాలని దాస్తున్నాడని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే తన ప్రాణాలకు ఆయుధ మాఫియా నుంచి ముప్పుంటుందని భావించే అతను వెల్లడించడం లేదని, అయినప్పటికీ ఎలాగైనా ఆయుధాల డొంకను కదిలిస్తామని చెప్పారు.
కాగా, వారం రోజుల సిఐడి కస్టడీ ముగియడంతో శుక్రవారం దంతలూరి కృష్ణను అధికారులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో న్యాయమూర్తి నిందితుడికి ఈ నెల 6వరకూ జ్యూడీషియల్ కస్టడీ విధించారు. అధికారులు కృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు. సూరి హత్యకేసులో అరెస్టైన భానుకిరణ్‌కు ఈ నెల 13వరకూ న్యాయస్థానం రిమాండ్ విధించింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications