వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలికి బెయిల్ వెనుక జగన్ బంధువు: వర్ల రామయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Varla Ramaiah
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు వైవి సుబ్బా రెడ్డిది కీలక పాత్ర అని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డికి సుబ్బా రెడ్డి దగ్గరి బంధువని, సిబిఐ కోర్టు న్యాయమూర్తితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

ముందుగా గాలికి బెయిల్ ఇప్పిస్తే తర్వాత జగన్‌ను కూడా అదే మాదిరిగా బయటకు తీసుకురావచ్చునని సుబ్బా రెడ్డి ముందుండి ఈ వ్యవహారం నడిపించారని చెప్పారు. అవినీతిని వెలుగులోకి తేవడంలో సిబిఐ కృషిని ప్రజలు అభినందిస్తున్నారన్నారు. అదే విధంగా సుబ్బా రెడ్డి పాత్రపై కూడా సిబిఐ విచారణ జరపాలన్నారు. న్యాయ శాఖ మంత్రిగా ఉన్న ఏరాసు ప్రతాప రెడ్డి.. అక్రమ మార్గంలో గాలి బెయిలు పొందడానికి సహకరించడం దారుణమని, ఆయనను మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే తప్పించాలని కోరారు.

చంచల్‌గూడా జైలులో గాలి జనార్ధన రెడ్డికి అన్ని సౌకర్యాలు కల్పించింది ఏరాసు ప్రతాప రెడ్డేనని, ఇప్పుడు న్యాయమూర్తిని ప్రలోభ పెట్టడానికి కూడా ప్రయత్నించారని, ఆయనకు ఇంకా మంత్రిగా కొనసాగే హక్కు లేదన్నారు. జగన్ పార్టీ నాయకురాలు శోభా నాగి రెడ్డి గురించి మాట్లాడుతూ.. పరిటాల రవి హత్య జరిగిన సమయంలో ఆమె అనంతపురం పార్టీ కార్యాలయంలోనే ఉన్నారని, ఈ హత్యను జగన్ చేయించాడని ఆమె ఆ రోజు ప్రకటన చేశారని అన్నారు.

ఇప్పుడు జగన్ సచ్ఛీలుడని, దేవుడని అంటున్నారని విమర్శించారు. ఆ రోజు నేరస్థుడు ఈ రోజు సచ్ఛీలుడు ఎలా అయ్యాడో ఆమె చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ రోజు శోభా నాగి రెడ్డి చేసిన ప్రకటన కాపీలను ఆయన మీడియాకు చూపించారు. రాష్ట్ర మంత్రివర్గం దొంగల బండి మాదిరిగా తయారైందని, మంత్రివర్గ సమావేశాన్ని త్వరలో చంచల్‌గూడా జైలులో పెట్టే పరిస్ధితి రానుందని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
Telugudesam Party leader Varla Ramaiah suspected YSR 
 
 Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy's 
 
 close relative YV Subba Reddy behind Karnataka fomer 
 
 minister Gali Janardhan Reddy bail issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X