ఉప ఎన్నికలు 15 మంది అభ్యర్థులది నేరచరిత్ర

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం అభ్యర్థి గుణపాటి దీపక్ రెడ్డిపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో భూవివాదం కేసు పెండింగులో ఉన్నట్లు ఆ ఆంగ్ల దినపత్రిక రాసింది. రాయదుర్గం పోలీసు స్టేషనులో నమోదైన ఓ కేసులో కూడా ఆయన నిందితుడని ఆ పత్రిక రాసింది. తనపై తప్పుడు కేసులు బనాయించారని, వ్యక్తిగత కక్షతో తనపై కేసులు పెట్టారని దీపక్ రెడ్డి తన అఫిడవిట్‌లో రాశారు.
నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం - వరంగల్ జిల్లా పరకాల అభ్యర్థుల్లో బిజెపి అభ్యర్థి విజయచంద్రా రెడ్డికి ఏ విధమైన నేరచరిత్ర లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి మొలుగూరి బిక్షపతిపై నాలుగు కేసులున్నాయి. కాంగ్రెసు అభ్యర్థి సంబారి సమ్మారావుపై కేసు ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నందున బిక్షపతి రాష్ట్ర ప్రభుత్వం కేసుల్లో ఇరికించిందని తెరాస నాయకులు అంటున్నారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాంపుల్లారెడ్డిపై 1997లో హత్య కేసు నమోదైంది. ఆయనకు కర్నాలు నాలుగో అదనపు జిల్లా న్యాయస్థానం 2001లో జీవితఖైదు విధించింది. అయితే, హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలకు ఈ నెల 12వ తేదీ పోలింగ్ జరగనుంది.












Click it and Unblock the Notifications